iDreamPost

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. నెలకు లక్షకు పైగా జీతం

మీరు ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.

మీరు ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నారా? అయితే ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.

ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. నెలకు లక్షకు పైగా జీతం

మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఇంటర్ అర్హతతో ఉండే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంటర్ క్వాలిఫికేషన్ తోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడిపోవచ్చు. ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి. ఇటీవల కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌) పారామెడికల్ స్టాఫ్ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

బీఎస్‌ఎఫ్‌ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. గ్రూప్ బీ,సీ పోస్టుల భర్తీ కోసం మహిళా, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 85 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి 10+2, డిగ్రీ, డిప్లొమా, కోర్సు పాసై ఉండాలి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 17 జూన్ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 85

విభాగాల వారీగా ఖాళీలు:

ఎస్సై(స్టాఫ్ నర్స్)

  • 14

ఏఎస్సై( ల్యాబ్ టెక్నీషియన్)

  • 38

ఏఎస్సై (ఫిజియోథెరపిస్ట్)

  • 47

అర్హత:

  • పోస్టులను అనుసరించి 10+2, డిగ్రీ, డిప్లొమా, కోర్సు పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • ఏఎస్సై( ల్యాబ్ టెక్నీషియన్)కి 18-25 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఏఎస్సై (ఫిజియోథెరపిస్ట్)కు 20-27, ఎస్సై(స్టాఫ్ నర్స్)కు 21-30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యూమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఎస్సై(స్టాఫ్ నర్స్)కు నెలకు రూ. 35,400-1,12,400 చెల్లిస్తారు. ఏఎస్సై( ల్యాబ్ టెక్నీషియన్), (ఫిజియోథెరపిస్ట్)కు రూ. 29,200-92-300 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సై(స్టాఫ్ నర్స్) పోస్టులకు అప్లై చేసుకునే వారు రూ. 200 చెల్లించాలి. ఏఎస్సై( ల్యాబ్ టెక్నీషియన్), (ఫిజియోథెరపిస్ట్)కు అప్లై చేసుకునేందుకు రూ. 100 చెల్లించాలి.

దరఖాస్తు చివరి తేదీ:

  • 17-06-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి