iDreamPost

లైబ్రేరియన్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర వరకు జీతం.. అర్హులు వీరే!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు వేతనం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలక ఏయే అర్హతలు ఉండాలంటే?

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. లైబ్రేరియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్షన్నర వరకు వేతనం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలక ఏయే అర్హతలు ఉండాలంటే?

లైబ్రేరియన్ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షన్నర వరకు జీతం.. అర్హులు వీరే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇటీవల 6100 పోస్టులతో డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదివరకే గ్రూప్1,గ్రూప్2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా వాటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. లైబ్రేరియన్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సబార్డినేట్‌ సర్వీసులో లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఏపీపీఎస్సీ.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం:

మొత్తం లైబ్రేరియన్‌ పోస్టులు:

  • 4

అర్హత:

  • మొదటి లేదా ద్వితీయ శ్రేణిలో ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. బయాలజీలో డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటరైజ్డ్ డేటాబేస్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 01.07.2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 61960-1,51,370 గా అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ:

  • కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.370 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం :

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులు ప్రారంభం తేదీ:

  • 27-03-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 16-04-2024

ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి