iDreamPost

BTech పాసైతే చాలు.. విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలు.. నెలకు 1,40,000 జీతం

బీటెక్ ఉత్తీర్ణులైన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000 జీతం అందుకోవచ్చు.

బీటెక్ ఉత్తీర్ణులైన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000 జీతం అందుకోవచ్చు.

BTech పాసైతే చాలు.. విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలు.. నెలకు 1,40,000 జీతం

బీటెక్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలే మీ లక్ష్యమా? అయితే మీకు గుడ్ న్యూస్. బీటెక్ పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వరంగానికి చెందిన విద్యుత్ సంస్థలో ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. విద్యుత్ సంస్థ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. న్యూఢిల్లీలోని ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000 జీతం అందుకోవచ్చు. లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు.

న్యూఢిల్లీలోని ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తోపాటు సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లోని వివిధ విభాగాల్లో ఇంజినీర్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వరా మొత్తం 435 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతేడాది సెప్టెంబరు 26న విడుదల చేసిన నోటిఫికేషన్(Advt. No. CC/08/2023)కు అనుబంధంగా తాజా నోటిఫికేషన్‌ను పీజీసీఐఎల్ విడుదల చేసింది. బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్-2024 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన వివరాలు:

ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల సంఖ్య:

435

విభాగాల వారీ ఖాళీలు:

ఎలక్ట్రికల్: 331

ఎలక్ట్రానిక్స్: 14

సివిల్: 53

కంప్యూటర్ సైన్స్: 37

అర్హత:

కనీసం 60 శాతం మార్కులతో ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ పాసై ఉండాలి. గేట్‌-2024 ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు:

రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్

ఎంపిక విధానం:

గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

12-06-2024

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:

04-07-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి