iDreamPost
android-app
ios-app

పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా.. అయితే రేపు ఒక్కరోజే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి అవకాశం. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. రేజు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి.

పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి ఇదే మంచి అవకాశం. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. రేజు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి.

పోలీస్ ఉద్యోగం మీ లక్ష్యమా.. అయితే రేపు ఒక్కరోజే ఛాన్స్.. మిస్ చేసుకోకండి

శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులదే ముఖ్యపాత్ర. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు కూడా వెనకాడరు. సమాజంలో పోలీసులుకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. అందుకే యువత పోలీసు ఉద్యోగాల కోసం పరితపిస్తుంటారు. కేంద్ర, రాష్ట్రల్లో విడుదలయ్యే పోలీస్ ఉద్యోగాల కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. పోలీస్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా సన్నద్ధమవుతుంటారు. మరి మీరు కూడా పోలీస్ ఉద్యోగాలను ఇష్టపడతారా? పోలీస్ ఉద్యోగం సాధించడం మీ కలనా? అయితే మీ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉంది. ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

ఇటీవల రైల్వే శాఖలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్ఫఎఫ్), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 4,660 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేసుకునేందకు మే 14 తో గడువు ముగుస్తుంది. అంటే రేపు ఒక్క రోజు మాత్రమే ఛాన్స్ ఉంది. టెన్త్, డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఎస్సై పోస్టులకు రూ.35,400 అందిస్తారు. కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 వేతనంగా ఇస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 4,660.

కానిస్టేబుల్‌ పోస్టులు

  • 4,208

ఎస్సై పోస్టులు

  • 452

అర్హత:

  • కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయో పరిమితి:

  • 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి. ఎస్సై పోస్టుల కోసం అభ్యర్థులు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా కేటగిరి వర్గాల వారికి వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • ఆన్‌ లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్‌ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎస్సై పోస్టులకు రూ.35,400 అందిస్తారు. కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 వేతనంగా ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250, ఇతరులకు రూ.500 ఉంటుంది. పరీక్షకు హాజరైన వారికి రూ.400 రిఫండ్‌ అందిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభం:

  • 15-04-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 14-05-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి