iDreamPost
android-app
ios-app

మహిళా టీచర్ ను వేధించిన ఆకతాయి.. రక్షించిన దిశ పోలీసులు

మహిళా టీచర్ ను వేధించిన ఆకతాయి.. రక్షించిన దిశ పోలీసులు

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక మహిళలపై జరుగుతున్న దారుణాలు, అఘాయిత్యాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే దిశ యాప్ ను రూపొందించి మహిళ భద్రతకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఇలా బాధితులు సమాచారం ఇచ్చిన క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని మహిళలకు, అమ్మాయిలకు అండగా నిలుస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ నిందితుడు ఇటీవల ఓ మహిళా టీచర్ ను వేధించాడు. దీంతో ఆ మహిళ వెంటనే దిశ SOS పోలీసులను సమాచారం ఇచ్చింది. క్షణాల్లో అక్కడికి చేరుకుని ఆ ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలులోని ఓ ప్రైవేట్ బాయ్స్ స్కూల్ లో ఓ మహిళ టీచర్ గా పని చేస్తున్నారు. అయితే గతంలో ఆమెతో చంద్రశేఖర్ అనే వ్యక్తి కలిసి పని చేసేవాడు. అలా ఇద్దరి మధ్య కాస్త పరిచయం పెరిగింది. ఇదే పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న చంద్రశేఖర్ ఆమెపై మనసుపడ్డాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళా టీచర్ ను వేధిస్తూ వచ్చాడు. పద్ధతి మార్చుకోవాంటూ ఆమె అనేకసార్లు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా బుద్ది మార్చుకోని చంద్రశేఖర్.. అదే పనిగా ఆమెను వేధిస్తూ వచ్చాడు.

ఇంతే కాకుండా మార్ఫింగ్ చేసిన ఫోటోలతో ఆమెను బ్లాక్ మెయిల్ కూడా చేసేవాడు. ఇక సోమవారం సైతం చంద్రశేఖర్ ఆ మహిళా టీచర్ రోడ్డుపై వేధించాడు. అతడి వేధింపులను తట్టుకోలేకపోయిన ఆ మహిళా.. వెంటనే దిశ sos పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు చంద్రశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు చంద్రశేఖర్ పై ఐపీసీ 354 D, 506, 509 సెక్షన్ల కింద ఒంగోలు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన సమయంలో వచ్చి కాపాడినందుకు ఆ మహిళా టీచర్ దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: చిత్తూరు వాసికి ఉరి శిక్ష! ఎంతటి పాపం చేశాడో తెలుసా?