iDreamPost

Ongole Cow: కళ్లు చేదిరే ధర పలికిన ఒంగోలు ఆవు.. ఏకంగా 40 కోట్లు!

ప్రపంచం వ్యాప్తంగా ఒంగోలు జాతి పశువులకు ఎంత గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. రాజసం, పౌరుషానికి ఇవి పెట్టింది పేరు ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు. తాజాగా ఓ వేలంలో ఒంగోలు జాతి ఆవు కళ్లు చెదిరే ధర పలికింది.

ప్రపంచం వ్యాప్తంగా ఒంగోలు జాతి పశువులకు ఎంత గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. రాజసం, పౌరుషానికి ఇవి పెట్టింది పేరు ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు. తాజాగా ఓ వేలంలో ఒంగోలు జాతి ఆవు కళ్లు చెదిరే ధర పలికింది.

Ongole Cow: కళ్లు చేదిరే ధర పలికిన ఒంగోలు ఆవు.. ఏకంగా 40 కోట్లు!

ఒంగోలు జాతి గిత్తలకు ఎంత గిరాకీ ఉందో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. రాష్ట్రంలో ఏ పందెంలోనైనా ఈ గిత్తలదే పై చేయి. రాజసం, పౌరుషానికి ఇవి పెట్టింది పేరు ఈ ఒంగోలు జాతి గిత్తలు. ముఖ్యంగా పశువుల్లో ఒంగోలు జాతి వాటికి ఉన్న డిమాండే వేరుగా ఉంటుంది. ప్రపంచం వ్యాప్తంగా ఒంగోలు జాతి ఆవులు, గిత్తలు ఎంతో పేరు ఉంది. అందుకే ఒంగోలు జాతి ఆవులను ఎద్దులను ఎంత ధర పెట్టైనా సరే సొంతం చేసుకోవడానికి  ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే వివిధ వేలం పోటీల్లో ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులు భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ వేలంలో ఒంగోలో జాతి ఆవు కళ్లు  చేదిరే ధర పలికింది. 40 కోట్ల భారీ ధర పలికింది.

బ్రెజిల్ దేశంలో పశుపోషకులు  గిర్, ఒంగోలు జాతి వంటి తదితర భారతీయ జాతుల ఆవులు, గిత్తలను పెంచుకోవడంపై ఆసక్తి చూపిస్తుంటారు. అలా  భారతీయ జాతుల ఆవులను గిత్తలను పెంచి పోషిస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఒంగోలు వంటి దేశీ ఆవులు, గిత్తల ధరలు కూడా ఔరా అనిపించేలా ఉంటాయి. తరచూ బ్రెజిల్లో పశువుల వేలం జరుగుతుంటుంది. ఇక్కడ అనేక రకాల జాతులకు చెందిన ఆవులు, గిత్తలు ప్రదర్శించ బడుతుంటాయి. అయితే భారతీయ జాతులు అయినా ఒంగోలు ఆవులు, గిత్తలే భారీ ధరలు పలుకుతుంటాయి. గతంలో ఒంగోలు జాతి ఆవులు భారీ ధరలు పలికాయి. తాజాగా ఆ రికార్డులన్ని బద్దలు కొడుతూ  ఓ ఆవు భారీ వేలం పలికింది. బ్రెజిల్ లో ని సావ్ పాల్ లోని అరండూలో పశువుల వేలం జరిగింది. ఇక్కడ ప్రపంచం చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా ఆ ఆవు కళ్లు చెదిరే ధర పలికింది.

ఒంగోలు జాతికి చెందిన నాలుగున్నరేళ్ల ఆవు భారీ  ధర పలికింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 కోట్ల ధర పలికింది. గతంలో ఐవీఎప్ ఏజేజే అనే పేరు గల ఒంగోలు ఆవు రూ.14.86 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ రికార్డును కూడా తాజాగా వేలంలో ఈ ఆవు బద్దలు కొట్టింది. బ్రెజిల్ లో  భారతీయ సంతతి ఆవులకు ఇంతకు ముందెన్నడూ ఇంత అధిక  ధర పలకలేదు. ఈ ఆవు పేరు వియటిన-19ఎఫ్ఐవీ ఈ ఆవు నెల్లూరు జాతికి చెందిన ఆవు. ఈ ప్రత్యేక ఆవు జాతి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలు జిల్లా ప్రాంతాల్లో నుండి ఉద్భవించింది. ఈ జాతి ఆవులు, గిత్తలను ఆ ప్రాంతాల నుంచి బ్రెజిల్‌కు రవాణా చేయబడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవులుగా ఈ నెల్లూరు జాతి ఆవులను అమ్ముతుంటారు.

ఈ జాతి ఆవు ఎటువంటి వాతావరణానికైనా తట్టుకోగలదు. ఈ ఆవు అనేది తెల్లగా, మెరుస్తూ ఉంటుంది. ఈ ఆవులు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొగలవు. దీనితోపాటు వీటి చర్మం దృడంగా ఉండటం వలన రక్తం పీల్చే కీటకాలను తట్టుకుని ఈ ఆవులు ఉండగలవు. ఇవి పాలు కూడా ఎక్కువగా ఇస్తాయి. దీంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక మూలకాలు ఈ ఆవు పాలలో ఉన్నాయి. ఈ ఆవులు చాలా దృడంగా కూడా ఉంటాయి. మొత్తంగా ఒంగోలు జాతి ఆవు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మరి.. ఒంగోలు ఆవు..రూ.40 కోట్ల పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి