iDreamPost

ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం.. 700 కార్లు, 8 ప్రైవేట్ విమానాలు, కోట్ల ఆస్తులు

  • Published Apr 26, 2024 | 12:15 PMUpdated Apr 26, 2024 | 12:15 PM

Worlds Richest Family: ప్రపంచ కుబేరులు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది బిల్‌ గేట్స్‌, ఎలాన్‌ మస్క్‌. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం ఎవరిదో మీకు తెలుసా.. ఆ కుటుంబానికి 4 వేల కోట్ల రూపాయల విలువైన ఇల్లు, 700 ‍కార్లు, ఇంకా అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి. మరి ఇంతకు ఆ కుటుంబం ఎవరిది అంటే..

Worlds Richest Family: ప్రపంచ కుబేరులు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది బిల్‌ గేట్స్‌, ఎలాన్‌ మస్క్‌. కానీ ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం ఎవరిదో మీకు తెలుసా.. ఆ కుటుంబానికి 4 వేల కోట్ల రూపాయల విలువైన ఇల్లు, 700 ‍కార్లు, ఇంకా అనేక విలువైన ఆస్తులు ఉన్నాయి. మరి ఇంతకు ఆ కుటుంబం ఎవరిది అంటే..

  • Published Apr 26, 2024 | 12:15 PMUpdated Apr 26, 2024 | 12:15 PM
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం.. 700 కార్లు, 8 ప్రైవేట్ విమానాలు, కోట్ల ఆస్తులు

సాధారణంగా మనం ప్రపంచ కుబేరులు, ఆసియా ధనవంతుల గురించి వార్తలు చదువుతుంటాం. అయితే అది వారి ఒక్కరి పేరు మీదనే ఉన్న సంపద. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల కుటుంబం గురించి. ఈ వరల్డ్‌ రిచ్చెస్ట్‌ ఫ్యామిలీకి ఏకంగా 700 కార్లు, 8 ప్రైవేట్ విమానాలు, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ప్రముఖ కంపెనీల్లో పెట్టుడులు కూడా ఉన్నాయి. మరి ఇంత ధనవంతులు కుటుంబం ఎవరిది.. వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు వంటి వివరాలు మీ కోసం..

సాధారణంగా సంపదను డబ్బు, ఆస్తి, బంగారం, బంగ్లాలు, విలాస వస్తువులతో కొలుస్తారు. మరి ఇవన్ని ఇబ్బడిముబ్బడిగా ఉండి.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన కుటుంబంగా రికార్డుల్లోకెక్కింది అబుదాబి రాజకుటుంబం. విశేష సంపదతో ఈ ఫ్యామిలీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా నిలిచింది. ఫిబ్రవరి 2024 నాటికి, ఈ కుటుంబం మొత్తం నికర విలువ రూ. 25,33,113 కోట్లుగా తెలిసింది. కుటుంబానికి 8 ప్రైవేట్ జెట్‌లు, సుమారు 700 లగ్జరీ కార్లతో పాటు పర్సనల్ షిప్ ఉంది. ఇందులో గోల్ఫ్ కూడా ఆడవచ్చు. ఇ‍ప్పుడు ప్రతి ఒక్కరు ఈ అబుదాబి రాజ కుటుంబం సంపద గురించి మాట్లాడుకుంటున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ స్టేట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నయన్ కుటుంబానికి ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైనపెట్టుబడులు ఉన్నాయి. ఆయన నివసించే ఇంటి ధరే ఏకంగా 4 వేల కోట్ల రూపాయలకు పైమాటే. 3.80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌కి కాస్ట్రా అల్ వతన్ అని పేరు పెట్టారు. దాని గేటుపై 37 మీటర్ల వెడల్పు గల గోపురం నిర్మించబడింది.

Worlds Richest Family UAE Al Nahyan Royal Family 02

ఇది కాకుండా కుటుంబానికి 700 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటిల్లో 5 బుగాటి వేరియంట్లు, లాంబోర్గిని రివెంట‌న్‌, మెర్సిడీజ్ బెంజ్ సీఎల్‌కే జీటీఆర్, ఫెరారి 599ఎక్స్ఎక్స్, మెక్‌లారెన్ ఎంసీ12 లాంటి అత్యంత లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ కుటుంబానికి సొంతంగా 8 ప్రైవేటు విమానాలు కూడా ఉన్నాయి. అంతేకాక.. ఈ రాజకుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద పడవను కూడా కలిగి ఉంది. దానిపై సాధారణ గోల్ఫ్ కోర్స్ నిర్మించారు.

ఇక ఆ కుటుంబానికి దేశ, విదేశాల్లో ఇబ్బడిముబ్బడిగా భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఫుట్‌బాల్ క్ల‌బ్‌ అయిన మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్‌లో ఈ రాయల్‌ కుటుంబానికి వాటా కూడా ఉంది. మాంచెస్ట‌ర్ సిటీ ఫుట్‌బాల్ జ‌ట్టులో రూ.2122 కోట్ల‌ వాటా ఈ కుటుంబానిదే. ప్ర‌పంచంలో ఉన్న ఇంధ‌న నిల్వ‌ల్లో 6 శాతం ఆయిల్ రిజ‌ర్వ్స్.. మహ్మద్ బిన్ జాయెద్ కుటుంబానికి ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో ప్రముఖ కంపెనీల్లో ఈ కుటుంబానికి షేర్లు ఉన్నాయి. పాప్ సింగ‌ర్ రిహ‌న్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీ, ఎల‌న్ మ‌స్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌లో ఈ రిచ్చెస్ట్‌ ఫ్యామిలీ పెట్టుబడులు పెట్టింది. ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న ఈ కుటుంబంలో సభ్యులు సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి