iDreamPost

తోట పని వస్తే ఏడాదికి 30 లక్షల జీతం.. ఎక్కడో తెలుసా?

పల్లెటూర్లలో తోట పనికి వెళ్తే రోజుకు 500 ఇస్తారు. అయితే అదే తోట పనికి అక్కడ చేస్తే గంటకు 1500 ఇస్తారు. ఏడాదికి 30 లక్షలు పైనే ఇస్తారు. ఎక్కడంటే?

పల్లెటూర్లలో తోట పనికి వెళ్తే రోజుకు 500 ఇస్తారు. అయితే అదే తోట పనికి అక్కడ చేస్తే గంటకు 1500 ఇస్తారు. ఏడాదికి 30 లక్షలు పైనే ఇస్తారు. ఎక్కడంటే?

తోట పని వస్తే ఏడాదికి 30 లక్షల జీతం.. ఎక్కడో తెలుసా?

తోట పని వస్తే ఏడాదికి 30 లక్షలు ఇస్తారు. అంటే నెలకు 2 లక్షల 50 వేలు. గ్లాస్ డోర్ వెబ్ సైట్ ప్రకారం.. తోటమాలికి లండన్ లో ఇచ్చే యావరేజ్ జీతం 21,744 పౌండ్ స్టెర్లింగ్. భారత కరెన్సీ ప్రకారం 22 లక్షల 60 వేలు. రీడ్.కో.యూకే వెబ్ సైట్ ప్రకారం.. ఫుల్ టైం పని చేసే తోటమాలికి లండన్ లో 26,208 పౌండ్ స్టెర్లింగ్ నుంచి 29,108 పౌండ్ స్టెర్లింగ్ జీతం ఉంటుందట. అంటే భారత కరెన్సీ ప్రకారం 27 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుంది. టోటల్ జాబ్స్ వెబ్ సైట్ ప్రకారం తోట పని వచ్చిన వారికి లండన్ లో ఏడాదికి 26,703 పౌండ్ స్టెర్లింగ్ జీతం ఇస్తారు. అంటే మన కరెన్సీ ప్రకారం 27 లక్షలన్న మాట. ఇది యావరేజ్ శాలరీ. ఇంతకంటే ఎక్కువే ఉండచ్చు కూడా. ఈస్ట్ లండన్ లో ఏడాదికి 32,500 పౌండ్ స్టెర్లింగ్ జీతం ఇస్తారు. ఇది హయ్యెస్ట్ పెయిడ్ శాలరీ. మన కరెన్సీ ప్రకారం 33 లక్షల 77  వేలు.

ఆయా వెబ్ సైట్స్ ప్రకారం.. ఫుల్ టైం తోటమాలికి ఏడాదికి 22 లక్షల నుంచి 33 లక్షల వరకూ జీతం ఇస్తున్నారు. అయితే ఆయా ప్రదేశాలను బట్టి జీతంలో తేడా ఉంది. గంటకి ఇంత అని కూడా పే చేస్తున్నారు. సౌత్ వార్క్ లో గంటకు 14.38 పౌండ్ స్టెర్లింగ్ జీతం ఇస్తున్నారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 1500 రూపాయలు. ఆడుతూ పాడుతూ ఒక 2 గంటలు పని చేస్తే రోజుకు 3 వేలు వస్తాయి. నెలకు 90 వేలు వస్తాయన్నమాట. ఈస్ట్ లండన్ లో గంటకు 13.74 పౌండ్ స్టెర్లింగ్, రిచ్ మాండ్ లో 13.52 పౌండ్ స్టెర్లింగ్, ఎన్ఫీల్డ్ లో 12.51 పౌండ్ స్టెర్లింగ్, సౌత్ వెస్ట్ లండన్ లో 10.83 పౌండ్ స్టెర్లింగ్ పే చేస్తారు. ఇంతకీ ఏ పని చేయాలి అంటే.. ఫ్రూట్స్, కూరగాయలు కూయడం, హెడ్జ్ కటింగ్, కలుపు తీయడం, చెట్లను కత్తిరించడం వంటివి చేయాలి.

పని వచ్చిన సీనియర్స్ కి ఎక్కువ పే ఉంటుంది. అదే అప్రెంటిస్ కి అయితే కాస్త తక్కువ జీతం ఉంటుంది. ఫుల్ టైం, పార్ట్ టైం, పర్మినెంట్, టెంపరరీ కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన గ్లాస్ డోర్, రీడ్.కో.యూకే వంటి వెబ్ సైట్స్ వాళ్ళు తోటమాలి జాబ్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఎక్కడ చేయాలి? ఎంత జీతం చెల్లిస్తారు? వంటి వివరాలు అందులో ఉంచుతారు. ట్రైనీ గార్డెనర్స్ ని కూడా తీసుకుంటున్నారు. వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. అయితే ఈ ఉద్యోగం చేయాలంటే పాస్ పోర్ట్, వీసా ఉండాలి. ఎందుకింత జీతాలు అంటే అక్కడ కూలీల కొరత ఎక్కువ. అందుకే అంతంత జీతాలు. మరి మీకు ఈ ఆఫర్ నచ్చితే తోటమాలి ఉద్యోగానికి ట్రై చేయండి. లేదా ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి ఈ కథనాన్ని షేర్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి