iDreamPost

భద్రతలో టాప్ అనిపించుకున్న ఐఫోన్‌ని బ్యాన్ చేసిన దేశం..

  • Published Apr 25, 2024 | 10:26 PMUpdated Apr 25, 2024 | 10:26 PM

ఐఫోన్ అంటే భద్రత.. భద్రత అంటే ఐఫోన్ అనేలా పేరు తెచ్చుకుంది. అలాంటి ఐఫోన్ ని సొంతం చేసుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ వాళ్ళు మాత్రం ఏ మాకొద్దుబే నీ ఐఫోన్ అని బ్యాన్ చేయడానికి రెడీ అయ్యారు.

ఐఫోన్ అంటే భద్రత.. భద్రత అంటే ఐఫోన్ అనేలా పేరు తెచ్చుకుంది. అలాంటి ఐఫోన్ ని సొంతం చేసుకోవాలని ఎంతోమంది కలలు కంటారు. కానీ వాళ్ళు మాత్రం ఏ మాకొద్దుబే నీ ఐఫోన్ అని బ్యాన్ చేయడానికి రెడీ అయ్యారు.

  • Published Apr 25, 2024 | 10:26 PMUpdated Apr 25, 2024 | 10:26 PM
భద్రతలో టాప్ అనిపించుకున్న ఐఫోన్‌ని బ్యాన్ చేసిన దేశం..

స్మార్ట్ ఫోన్స్ లో ఐఫోన్ కి ఉన్న బ్రాండ్ ఇమేజే వేరు. ఐఫోన్ లకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఐఫోన్ వాడడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తారు. ఆండ్రాయిడ్ తో పోలిస్తే భద్రత విషయంలో ఐఫోన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్న పేరు ఉంది. ఐఫోన్ నుంచి డేటాని హ్యాక్ చేయడం అంత ఈజీ కాదనే చాలా మంది ఐఫోన్ ని వాడతారు. పాస్వర్డ్ పెట్టినోడు ఓపెన్ చేస్తే తప్ప ఇంకెవరూ ఓపెన్ చేయలేరు. పాస్వర్డ్ లేకుండా ఓపెన్ చేయాలని చూస్తే డేటా మొత్తం ఎగిరిపోతుంది. అలానే వైరస్ ఎటాక్ కాకుండా గట్టి సెక్యూరిటీ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ తో పోలిస్తే ప్రైవసీ విషయంలో ఐఫోన్ చాలా బెటర్. అలానే కొన్ని పరిమితమైన యాప్స్ ని మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వీలు ఉంటుంది. ఐఫోన్ లో బ్లోట్ వేర్ ఉండదు. అంటే అదొక సాఫ్ట్ వేర్. స్మార్ట్ ఫోన్ లో ఆల్రెడీ ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది. దీని వల్ల ఫోన్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఐఫోన్ లో ఈ సమస్య ఉండదు. ఇన్ని ఫీచర్స్ కలిగిన ఐఫోన్ ని కొనడానికి అనేక దేశాల ప్రజలు వెంటపడుతున్నారు. అయితే ఒక దేశం మాత్రం మాకొద్దుబే అంటోంది.

ఆ దేశం మరేదో కాదు దక్షిణ కొరియా. భద్రతా కారణాల దృష్ట్యా సైనిక భవనాల్లో ఐఫోన్లను నిషేధిస్తున్నట్లు ఆ దక్షిణ కొరియా తెలిపింది. యాప్ నుంచి రికార్డ్ చేయగల, నియంత్రించగల పరికరాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జూన్ 1 నుంచి అమలుకానున్నాయి. జూన్ 1 తర్వాత ఆర్మీ ఉద్యోగులు సైనిక భవనాల్లోకి ఐఫోన్ తీసుకెళ్లడానికి వీల్లేదు. నేషనల్ డిఫెన్స్ మొబైల్ సెక్యూరిటీ యాప్ అనేది దక్షిణ కొరియా దేశానికి సంబందించిన యాప్. దీన్ని ఖచ్చితంగా అన్ని మిలిటరీ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందే. మిలిటరీకి సంబందించిన డేటా అనేది లీక్ అవ్వకుండా ఉండాలంటే ఫోన్లలో కెమెరా, వైఫై, టెథరింగ్, మైక్రోఫోన్ ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని కోసం దక్షిణ కొరియా యాప్ ని ఇన్ స్టాల్ చేయాలి. అయితే కెమెరా మినహాయించి మైక్రోఫోన్, యూఎస్బీ ఫంక్షన్స్, ఇతర హార్డ్ వేర్ లని డిజేబుల్ చేయడానికి యాపిల్ కంపెనీ యొక్క కఠినమైన ప్రైవసీ కంట్రోల్స్ అనుమతించవు.

అయితే దక్షిణ కొరియా డిఫెన్స్ మొబైల్ సెక్యూరిటీ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లలో హార్డ్ వేర్ ని నియంత్రించగలదు. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కి ఎలాంటి కఠినమైన షరతులు లేవు. అందుకే శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్ ఫోన్లను మాత్రం అనుమతించింది. దక్షిణ కొరియా హెరాల్డ్ నివేదిక ప్రకారం.. దక్షిణ చుంగ్ చియోంగ్ ప్రావిన్స్ లోని గైయోంగ్ డేలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం ప్రధాన కార్యాలయంలో సంయుక్త సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో మిలిటరీలో ఐఫోన్ లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాలోని మిలిటరీ ప్రదేశాల్లో ఐఫోన్ వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఐఫోన్లతో పాటు యాపిల్ స్మార్ట్ వాచ్ లను కూడా నిషేధించనుంది. జూన్ 1 నుంచి దక్షిణ కొరియాలో మిలిటరీ ప్రదేశాల్లో ఐఫోన్ కనిపించదు.        అయితే ఈ నిర్ణయం వల్ల దాదాపు 5 లక్షల మంది ఆర్మీ వాళ్ళు, ప్రధాన కార్యాలయంలో పని చేసే సిబ్బంది 10 వేల మంది నష్టపోనున్నారు. అయితే ఈ నిర్ణయం వెనుక జాతీయవాద ఉద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ బ్రాండ్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా కూడా ఐఫోన్ ని నిషేధిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దక్షిణ కొరియా దేశం మిలిటరీ భవనాల్లో ఐఫోన్లు, స్మార్ట్ వాచ్ లపై నిషేధం విధించడంపై మీ అబిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి