iDreamPost

సెప్టెంబర్ 13 – వన్ సైడ్ వారేనా

సెప్టెంబర్ 13 – వన్ సైడ్ వారేనా

పెద్ద సినిమాలు రిలీజులకు భయపడుతున్న వేళ సెప్టెంబర్ కూడా చిన్న చిత్రాలతో నిండిపోతోంది. 10వ తేదీ ఒక్క గోపి చంద్ సీటిమార్ మాత్రమే చెప్పుకోదగ్గ రేంజ్ లో భారీగా విడుదల చేస్తున్నారు. అదే రోజు కంగనా రౌనత్ తలైవి కూడా ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా పడే అవకాశాలు తక్కువే. తమిళనాడు సీఎం జయలలిత కథను చూసేందుకు మన ఆడియన్స్ మరీ ఎక్కువ ఆసక్తిగా లేరు. ఇక 17ని సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ తీసేసుకుని అఫీషియల్ గా ప్రకటించింది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో బాబీ సింహా కీలక పాత్ర చేస్తుండగా కోన వెంకట్ రచనలో జనం దీన్నుంచి మంచి కామెడీని ఆశిస్తున్నారు

అదే రోజు విజయ్ ఆంటోనీ నటించిన డబ్బింగ్ మూవీ ‘విజయ రాఘవన్’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాని మీద కనీస బజ్ లేదు. బిచ్చగాడుతో వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకోలేకపోయిన విజయ్ ఆంటోనీ మార్కెట్ ఇప్పుడు బాగా డౌన్ లో ఉంది. టాక్ చాలా బాగుందని వస్తే తప్ప కలెక్షన్లను చూడలేం. ఎప్పుడో పూర్తయిన ‘మధుర వైన్స్’ అనే మరో చిన్న సినిమా కూడా రేస్ లోకి వచ్చింది. ఏదో యూత్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది కానీ నోటెడ్ క్యాస్టింగ్ లేని ఇలాంటి వాటికి ఎస్ఆర్ కళ్యాణమండపం రేంజ్ లో రెస్పాన్స్ వస్తే తప్ప కనీస వసూళ్లను ఆశించలేం. ఈ యాంగిల్ లో చూస్తే వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

థియేటర్లు తెరుచుకున్నా ఏపిలో సెకండ్ షోలు ఇంకా మొదలుకాలేదు. టికెట్ రేట్ల పంచాయితీ ఇంకా తెగలేదు. సిఎం జగన్ తో చర్చలు ఉన్నాయని ఒకసారి వాయిదా అని మరోసారి కథనాలు వస్తున్నాయి కానీ మీటింగ్ అయ్యాకే ఏదైనా నమ్మే పరిస్థితి. అందుకే లవ్ స్టోరీ మళ్ళీ కొత్త డేట్ చెప్పకుండా మౌనం పాటిస్తోంది. గల్లీ రౌడీతోనూ సందీప్ కిషన్ అద్భుతాలు చేసేంత కలెక్షన్లు తెస్తాడని కాదు కానీ ఏదో నవ్వుకునేలా సినిమా ఉందనే టాక్ వస్తే మాత్రం దానికి బిజినెస్ కు తగ్గ రేంజ్ లో లాభాలు రాబట్టుకోవచ్చు. ఇదంతా ఎలా ఉన్నా కనీసం 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసే సినిమా ఏదైనా వస్తే తప్ప బాక్సాఫీస్ దగ్గర ఎదురు చూస్తున్న ఊపు వచ్చేలా లేదు

Also Read : సినిమా ఎలక్షన్ల వెనుక రాజకీయ ఎత్తులు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి