iDreamPost

ఈ ఐడియాతో HYDలో రూ.30 లక్షలకే స్థలం, ఇల్లు సొంతం చేసుకోవచ్చు!

హైదరాబాద్ లో ఒక చోట స్థలం కొనుక్కుని అక్కడ మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటే వచ్చే ఆ కిక్కే వేరు. కానీ స్థలం కొనాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది అని నిరుత్సాహపడకండి. ఈ విధంగా చేస్తే స్థలం కొనుక్కోవడమే కాదు.. తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదివేయండి. 

హైదరాబాద్ లో ఒక చోట స్థలం కొనుక్కుని అక్కడ మనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటే వచ్చే ఆ కిక్కే వేరు. కానీ స్థలం కొనాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది అని నిరుత్సాహపడకండి. ఈ విధంగా చేస్తే స్థలం కొనుక్కోవడమే కాదు.. తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం పూర్తిగా చదివేయండి. 

ఈ ఐడియాతో HYDలో రూ.30 లక్షలకే స్థలం, ఇల్లు సొంతం చేసుకోవచ్చు!

స్థలం ఉండి ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్నా తక్కువలో తక్కువ ఒక రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. ఇక స్థలం కొనాలంటే ఇంతకు మించి ఖర్చు ఉంటుంది. హైదరాబాద్ లాంటి నగరంలో అయితే స్థలం రేట్లు చదరపు అడుగుకి రూ. 4 వేలు, రూ. 5 వేలు, రూ. 10 వేలు, రూ. 30 వేలు ఇలా ఉన్నాయి. ఈ రేట్లకి స్థలం కొని ఇల్లు కట్టుకోవాలంటే సామాన్యులకి నెరవేరని కల. అయితే ఈ ఐడియాతో మీరు సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్ లోనే. మీ బడ్జెట్ రూ. 30 లక్షలు అనుకుంటే.. మీరు స్థలంతో పాటు ఇల్లు కూడా సొంతం చేసుకోవచ్చు. అలా అని రాజీ పడిపోయి చిన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాల్సిన పని లేదు. కొంచెం విశాలంగానే సౌకర్యవంతంగా కట్టుకోవచ్చు. ఈ 30 లక్షల బడ్జెట్ లో హైదరాబాద్ లో 100 గజాల స్థలం వస్తుంది. 100 గజాలంటే 900 చదరపు అడుగులు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవచ్చు ఈ స్థలంలో. 2 BHK ఇల్లు కట్టుకోవాలంటే 900 నుంచి 1200 చదరపు అడుగుల స్థలం ఉండాలి.  

తక్కువ బడ్జెట్ లో స్థలం ఎక్కడ దొరుకుతుంది?

హైదరాబాద్ లో అభివృద్ధి అనేది శివారు ప్రాంతాలకు బాగా విస్తరిస్తోంది. సిటీకి దూరమైనా కూడా శివారు ప్రాంతాల్లో విల్లాలు, ఫ్లాట్లు కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రోడ్ కనెక్టివిటీ బాగుండడంతో డైలీ శివారు ప్రాంతాల నుంచే హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ జర్నీ చేస్తున్నారు. సిటీలో ఉండి అంతంత రెంట్లు పే చేసే కంటే కొంచెం దూరంగా ఉండి సొంతింట్లో ఉన్నా మేలని.. ట్రాఫిక్ ని సైతం పట్టించుకోకుండా చాలా మంది శివారు ప్రాంతాల్లో సెటిల్ అవుతున్నారు. అలాంటి శివారు ప్రాంతంలో తక్కువ బడ్జెట్ లో సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. ఉదాహరణకి పటాన్ చెరువునే తీసుకుందాం. కెమికల్ అండ్ ఫార్మా కంపెనీలు కలిగిన పారిశ్రామిక కేంద్రంగా పటాన్ చెరువు బాగా అభివృద్ధి చెందింది. మియాపూర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ వంటి ఐటీ సెక్టార్ ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీ అనేది ఉండడం వల్ల ఇక్కడ ఇల్లు కట్టుకునే వారి సంఖ్య పెరిగింది.

పటాన్ చెరువు నుంచి మాదాపూర్, మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాలకి రావాలంటే 20 కి.మీ. ట్రావెల్ చేస్తే సరిపోతుంది. ఈ పటాన్ చెరువులో ఈ ఏరియాలో స్థలం కొనాలంటే సగటున చదరపు అడుగుకి రూ. 3,350 పడుతుంది. 2024 గణాంకాల ప్రకారం పటాన్ చెరువులో చదరపు అడుగు స్థలం 3,350 రూపాయలుగా ఉంది. ఈ లెక్కన పటాన్ చెరువులో 200 గజాలు అంటే 1800 చదరపు అడుగుల స్థలానికి 44 లక్షల నుంచి 68 లక్షలు ఖర్చవుతుంది. 1800 చదరపు అడుగుల్లో 3 BHK ఇల్లు కట్టుకోవచ్చు. లేదు 2 BHK సరిపోతుంది అనుకుంటే కనుక 100 నుంచి 150 గజాల స్థలం కొనుక్కోవచ్చు. అంటే 900 నుంచి 1350 చదరపు అడుగుల స్థలానికి 30 లక్షల నుంచి 45 లక్షల వరకూ ఖర్చవుతుంది. 

ఇంటి నిర్మాణ వ్యయం ఎంత?:

900 చదరపు అడుగుల స్థలానికి పెట్టుబడి 30 లక్షలు.. ఇక ఈ స్థలంలో ఇల్లు కట్టాలంటే మరో 20 లక్షలు.. మొత్తం మీద 50 లక్షలు అవుతుంది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకురావాలి అని కంగారు పడకండి. స్థలానికి 30 లక్షలు మీరొక్కరే ఎందుకు పెట్టడం.. ఇందులో మీతో పాటు భాగస్వాములను చేర్చుకోండి. మీతో పాటు మరో ముగ్గురిని స్థలానికి భాగస్వాములుగా చేసుకోండి. అప్పుడు 30 లక్షలని నలుగురూ డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరికీ ఏడున్నర లక్షలు అవుతుంది. ఇక ఇంటి నిర్మాణానికి ఒక ఫ్లోర్ కి 20 లక్షల నుంచి 25 లక్షలు వేసుకున్నా ఫైనల్ గా 28 లక్షల నుంచి 33 లక్షల్లో సొంతిల్లు పూర్తవుతుంది. మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి వారితో సమస్య ఉండదు. అద్దె ఇంట్లో ఉండడం కంటే ఇలా తెలిసిన వాళ్ళతో స్థలం పంచుకుని ఉండడం ఉత్తమం కదా.. మీరు స్థలాన్ని పంచుకోవడంతో పాటు బడ్జెట్ లో వారితో బంధాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఇంకేముంటుంది చెప్పండి. 200 గజాల స్థలంలో విశాలంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక స్థలానికి ప్రత్యేకంగా 44 లక్షల నుంచి 68 లక్షలు అవుతుంది. నలుగురు ఈ స్థలాన్ని పంచుకుంటే 11 లక్షల నుంచి 17 లక్షలు అవుతుంది. ఒక్కొక్కరూ 25 లక్షలు వేసుకున్నా ఫ్లోర్ కి 36 లక్షల నుంచి 42 లక్షలు అవుతుంది.  

సొంత ఇల్లు, ఇండివిడ్యువల్ హౌస్, పక్కన వేరే ఫ్లాట్ వారు ఎవరూ ఉండరు. చాలా ప్రశాంతంగా ఉండవచ్చు. ఐతే ఇదే ధరలో ఫ్లాట్స్ కూడా వస్తున్నాయి కదా ఎందుకు రిస్క్ అనుకోకండి. కట్టించుకున్న ఇల్లు అంటే ఆ నమ్మకం వేరే ఉంటుంది కదా. పైగా ఫ్లాట్ స్థలం ఎప్పుడు మన సొంతం అవుతుందో చెప్పలేం. అక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ లో ఉండే వారి మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇండివిడ్యువల్ ఫ్లాట్ అనుకోండి.. ఆ ల్యాండ్ నలుగురి పేరు మీద రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఎవరైనా అమ్మేస్తాను అంటే మీలో ఎవరో ఒకరు కొనుక్కోవచ్చు. లేదా అందరూ సొంత ఊరు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు. ల్యాండ్ రేట్లు కూడా పెరుగుతాయి కాబట్టి ఎటువంటి లాస్ ఉండదు. ఫ్లాట్ లో పెట్టడం కంటే ఇలా ఇండివిడ్యువల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచి మార్గం. పటాన్ చెరువు లాంటి అభివృద్ధి చెందుతున్న ఏరియాల్లో ఈ విధంగా చేస్తే సంతోషంతో పాటు లాభం కూడా ఉంటుంది. చాల మంది తమ స్నేహితులు, బంధువులతో కలిసి ఇలా స్థలాన్ని కలిపి కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. 

గమనిక: స్థలం విస్తీర్ణం, ఆయా ప్రాంతాల్లో ఉన్న ధరలను బట్టి.. అలానే కన్స్ట్రక్షన్ కాస్ట్ బట్టి బడ్జెట్ లో మార్పులు అనేవి ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి