iDreamPost
android-app
ios-app

OG.. ఆ విషయంలో ‘KGF’ని మించి అట!

  • Author ajaykrishna Published - 03:15 PM, Wed - 27 September 23
  • Author ajaykrishna Published - 03:15 PM, Wed - 27 September 23
OG.. ఆ విషయంలో ‘KGF’ని మించి అట!

ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే.. ఖచ్చితంగా ఆ సినిమాను చాలా సినిమాలతో పోల్చుతుంటారు. ఆ విధంగా సినిమాలపై అంచనాలు కూడా పెరిగిపోతుంటాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాపై అలాంటి అంచనాలే పెంచుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న కథనాలు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. వాటిలో హరిహర వీరమల్లు ప్రస్తుతానికి షూటింగ్ బ్రేక్ ఇవ్వగా.. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. సాహో సుజిత్ తో ‘OG’ సినిమాలు చేస్తున్నాడు. అయితే.. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కంటే.. OG పైనే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఎందుకంటే.. చాలా కాలం తర్వాత పవన్ ఫ్రెష్ సబ్జెక్టుతో చేస్తున్న సినిమా ఇది. అంటే.. ఏ సినిమాకు రీమేక్ కాదన్నమాట. పైగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. సో.. ఖచ్చితంగా రొట్టకొట్టుడు చూపించడు అని గట్టిగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఓ అభిమానిగా సుజిత్ కూడా పవన్ ని హిట్స్ లో చూసి చాలా కాలం అయ్యింది. కాబట్టి.. OG చాలా స్పెషల్ కాబోతుందని అర్ధమవుతుంది. పవన్ ని చాలా కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా ప్రెజెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు సుజిత్. ఇప్పటికే విడుదలైన ఓజి టీజర్.. ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చింది. అసలు పవన్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో.. అలాగే చూపించి సర్ప్రైజ్ చేశాడు సుజిత్.

ఇదిలా ఉండగా.. సుజిత్ సినిమా పై ఇండస్ట్రీ వర్గాలలో ఓ స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అదేంటంటే.. టీజర్ బట్టి.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని అర్థమైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం.. OG లో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘KGF’కి మించి ఎలివేషన్స్ ఉంటాయట. దాదాపు కేజీఎఫ్ కంటే పది రెట్లు పవర్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలివేషన్స్ ఉంటాయని టాక్ నడుస్తోంది. మరి సుజిత్ ఎలివేషన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది. కానీ.. స్క్రిప్ట్ పరంగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది సినిమా చూసాకే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాని డీవీవి దానయ్య నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సో.. OG గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by WAWA ORIGINALS (@wawa_originals)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş