భారత్ ఆతిథ్యం ఇస్తున్న ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్-2023 అంతా రెడీ అయింది. మరికొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ స్టార్ట్ కానుంది. ఈసారి కప్ ఎగరేసుకుపోవాలని చాలా టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. అందులో భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ను ప్రధానంగా చెప్పుకోవాలి. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీ టీమిండియాకు కీలకం కానుంది. భారత్‌తో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చాలా బలంగా కనిపిస్తున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఈ రెండు టాప్ టీమ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. దీంతో ట్రోఫీ కోసం ప్రధానంగా భారత్, ఇంగ్లండ్, ఆసీస్ మధ్య భీకర పోరు తప్పదని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
న్యూజిలాండ్, సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కివీస్ అయితే గత రెండు వరల్డ్ కప్స్‌లోనూ ఫైనల్స్ వరకు వెళ్లింది. ఈసారి కూడా అదే పెర్ఫార్మెన్స్ను రిపీట్ చేయాలని అనుకుంటోంది. సౌతాఫ్రికాతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఎలాగైనా సెమీస్‌కు చేరాలని ఫిక్స్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచ కప్ మొదలయ్యేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని జట్ల సారథులతో కలిపి కెప్టెన్స్ రౌండ్ టేబుల్ పేరిట ఐసీసీ ఒక ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు టోర్నీలో పాల్గొంటున్న అన్ని టీమ్స్ కెప్టెన్స్ విచ్చేశారు. కెప్టెన్స్ రౌండ్ టేబుల్లో పాల్గొన్న జట్ల సారథులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
భారత్‌లో ఉంటే తమ ఇంట్లో ఉన్నట్లే ఉందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బంగ్లా కెప్టెన్ షకీబుల్ హసన్ మాట్లాడుతున్న టైమ్‌లో సౌతాఫ్రికా సారథి తెంబా బవుమా చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. షకీబ్ మాట్లాడుతున్న సమయంలో బవుమా కునుకు తీశాడు. అయితే కాసేపటి తర్వాత అతడు నిద్రలేచాడు. బవుమా నిద్రపోతున్న ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఏంటి బవుమా ఇది? ఒక దేశ కెప్టెన్ అయి ఉండి ఇలా ప్రోగ్రామ్‌లో నిద్రపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. అయితే కుటుంబ కారణాల వల్ల సౌతాఫ్రికాకు వెళ్లిన బవుమా.. తిరిగి మంగళవారం టీమ్‌తో జాయిన్ అయ్యాడు. జర్నీలో అలసిపోవడం వల్లే అతడు కునుకు తీశాడని మరికొందరు ఫ్యాన్స్ బవుమాకు సపోర్ట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇండియా ఆతిథ్యంపై పాక్ కెప్టెన్ బాబర్ కామెంట్స్ వైరల్!
Temba Bavuma during the Captain’s Round Table Event. pic.twitter.com/xaxRHTzg4V
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 4, 2023