ఆసియా కప్-2023 ముందు వరకు భారత జట్టు ప్రదర్శనపై, టీమ్ సెలెక్షన్ మీద పలు సందేహాలు ఉండేవి. కానీ ఆ టోర్నీతో అవన్నీ పటాపంచలు అయిపోయాయి. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని ఓడిస్తూ ఫైనల్‌కు చేరుకున్న భారత్.. తుది సమరంలో లంకను చిత్తు చేసింది. ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను కూడా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే గెలుచుకొంది టీమిండియా. అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణిస్తుండటం, ప్లేయర్లు సమష్టిగా ఆడుతుండం, అందరూ భీకర ఫామ్‌లో ఉండటం విశేషం. వరుస విజయాలతో వన్డే ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేసుకు చేరుకుంది టీమిండియా.
సక్సెస్ ట్రాక్‌లో ఉన్న భారత్‌కు వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో ఎదురు ఉండకపోవచ్చునని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. టీమిండియా అభిమానులు కూడా ఈసారి కప్ మనదేనని చెబుతున్నారు. దీనికి ప్రపంచ కప్‌ల సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తున్నారు. 2015 వరల్డ్ కప్‌కు ముందు ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నంబర్ వన్‌గా ఉంది. ఆ జట్టే ఆ ఏడాది కప్ గెలిచింది. 2019లోనూ అదే జరిగింది. 2019 ప్రపంచ కప్‌కు ముందు ఇంగ్లండ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. ఆ సంవత్సరం కప్పును ఇంగ్లీష్ టీమ్ ఎగరేసుకుపోయింది. దీంతో ఈసారి ఆ సెంటిమెంట్ ప్రకారం నంబర్ వన్ వన్డే టీమ్‌గా ఉన్న భారత్‌దే కప్పు అని ఫ్యాన్స్ అంటున్నారు.
2015 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తుది సమరంలో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది ఆసీస్. 2019లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడ్డాయి. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన కారణంగా ఇంగ్లీష్ టీమ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ సెంటిమెంట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్‌గా టీమిండియా ఫైనల్‌కు చేరితే.. అప్పుడు ప్రత్యర్థి కూడా న్యూజిలాండ్ అవుతుందని, ఇది ఫిక్స్ అని అభిమానులు చెబుతున్నారు.
ప్రపంచ కప్ విషయంలో మరో సెంటిమెంట్ కూడా భారత్‌కు అనుకూలంగా ఉంది. 2011లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకుంది. 2015లో ఆతిథ్య జట్టయిన ఆసీస్ కప్ సాధించింది. 2019లో సొంతగడ్డపై తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను ఇంగ్లండ్ ముద్దాడింది. ఈ లెక్కన.. రాసిపెట్టుకోండి, కప్ భారత్‌దేనని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈసారి వరల్డ్ కప్ ఎవరు నెగ్గుతారని మీరు భావిస్తున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సిరాజ్ అంటే షమీకి పడదా?
2015 – Number 1 ranked Team won the World Cup.
2019 – Number 1 ranked Team won the World Cup.
2023 – India confirmed as the number 1 ranked team ahead of the World Cup. pic.twitter.com/A8PlC9pqBW
— Johns. (@CricCrazyJohns) September 24, 2023