iDreamPost

వరల్డ్ కప్​లో టీమిండియాను అతడు ఒంటిచేత్తో గెలిపిస్తాడు: రవిశాస్త్రి

  • Author singhj Published - 01:28 PM, Thu - 5 October 23
  • Author singhj Published - 01:28 PM, Thu - 5 October 23
వరల్డ్ కప్​లో టీమిండియాను అతడు ఒంటిచేత్తో గెలిపిస్తాడు: రవిశాస్త్రి

వన్డే వరల్డ్ కప్ సంగ్రామం మరికొద్ది సేపట్లో మొదలుకానుంది. అహ్మదాబాద్​లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ స్టార్ట్ అవ్వనుంది. భారత జట్టు ఈసారి ఎన్నో ఆశలతో ప్రపంచ కప్​కు రెడీ అవుతోంది. సొంత గడ్డపై కోట్లాది మంది అభిమానుల కలను నిజం చేస్తూ కప్పును కైవసం చేసుకోవాలని కోరుకుంటోంది. అయితే 45 రోజుల పాటు జరిగే ఈ సుదీర్ఘ టోర్నీలో టైటిల్​ను గెలుచుకోవడం అంత ఈజీ కాదు. కలసికట్టుగా రాణిస్తేనే విజేతగా నిలవొచ్చు. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్​లో టీమిండియా విజయావకాశాలు, ఏయే ప్లేయర్లు కీలకమనే విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచ కప్​లో ఫైనల్​ ఎలెవన్​ను ఎంచుకోవడం అన్ని టీమ్స్​కు పెద్ద సవాల్​గా నిలుస్తుందని రవిశాస్త్రి అన్నాడు. టీమిండియా కూడా ఈ సమస్యను ఎదుర్కోక తప్పదన్నాడు. టీమ్ కోసం ప్రతి ఆటగాడు ఎప్పుడూ రెడీగా ఉండాలన్నాడు రవిశాస్త్రి. భారత బ్యాటింగ్​లో మిగతా వాళ్లతో పాటు సూర్యకుమార్ యాదవ్ రాణించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. చాన్నాళ్లుగా సూర్యను గమనిస్తున్నానని.. ఈ వరల్డ్ కప్​లో భారత జట్టుకు అతడే ఎక్స్ ఫ్యాక్టర్ అని రవిశాస్త్రి తెలిపాడు. సూర్య మ్యాచ్ విన్నర్ అని.. బిగ్ మ్యాచెస్​లో టీమ్​ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా అతడికి ఉందన్నాడు.

సూర్యకుమార్ చివరి 5 నుంచి 7 ఓవర్లు క్రీజులో ఉంటే చాలు. హార్దిక్​తో కలసి అతడు విధ్వంసం సృష్టించగలడు. చూస్తూ ఉండగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు. కాబట్టి ఫ్లాట్ పిచ్​లు ఉంటే సూర్యను పక్కాగా టీమ్​లోకి తీసుకోవాలి. శ్రేయాస్ అయ్యర్​ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ పెద్ద మ్యాచుల్లో లోవర్ ఆర్డర్​లో సూర్య టీమ్​లో ఉండాలి. అతడు ఆడితే అదనపు బలం చేకూరుతుంది’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. బౌలింగ్​లో భీకర ఫామ్​లో ఉన్న కుల్దీప్ యాదవ్​కు తుది జట్టులో ప్లేస్ దొరకడం కష్టమేనన్నాడు. అపోజిషన్ టీమ్​లో లెఫ్టాండర్లు ఉంటే అశ్విన్ జట్టులోకి వస్తాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్.. తొలి మ్యాచ్​లో గెలుపు ఎవరిదంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి