iDreamPost

నువ్వే కావాలి బ్యూటీ ఇంతలా మారిపోయిందేమిటీ..? అస్సలు నమ్మలేం

నువ్వే కావాలి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రిచా. కానీ తెలుగులో ఆమె సత్తా చాటలేకపోయింది. అటు హిందీ, తమిళ సినిమాలు చేసింది కానీ ఎందుకో ఆశించినంత ఫేమ్ రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే అస్సలు నమ్మలేరు.. ఎంతలా మారిపోయిందంటే..?

నువ్వే కావాలి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది రిచా. కానీ తెలుగులో ఆమె సత్తా చాటలేకపోయింది. అటు హిందీ, తమిళ సినిమాలు చేసింది కానీ ఎందుకో ఆశించినంత ఫేమ్ రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే అస్సలు నమ్మలేరు.. ఎంతలా మారిపోయిందంటే..?

నువ్వే కావాలి బ్యూటీ ఇంతలా మారిపోయిందేమిటీ..? అస్సలు నమ్మలేం

లవ్ స్టోరీలను ఫ్యామిలీకి మెలిపెడుతూ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడు దర్శకుడు విజయ్ భాస్కర్. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అద్భుత కళాఖండాలు. ప్రేక్షకులు ఎక్కువ సార్లు చూసిన చిత్రాల జాబితా తీస్తే విజయ్ భాస్కర్ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. స్వయంవరం, నువ్వేకావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరీ, భలే దొంగలు, ప్రేమకావాలి మూవీస్ .. టీవీల్లో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు. ఇక ఈ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ సినిమాల్లో ఫ్యామిలీ రిలేషన్ అండ్ లవ్ స్టోరీ పేర్లర్‌గా నడుస్తూ ఉంటాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ప్రేమ కావాలి. 2000లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన తరుణ్, రిచా హీరో హీరోయిన్లుగా నటించిన తొలి సినిమా ఇది. ఇందులో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్. అనగనగా ఆకాశం ఉంది, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడవెందుకు, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది పాటలు ఇప్పటికీ చార్ట్ బస్టర్సే. ఈ సినిమాకు కోటి బాణీలు అందించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన సహకారం అందించాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామోజీరావు, స్రవంతి రవికిషోర్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో తరుణ్‌కు జోడీగా నటించింది రిచా. ఈ మూవీతో ఈ పెయిర్ ది బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకుంది. ఈ ఇద్దరు కలిసి మళ్లీ చిరుజల్లు అనే చిత్రంలో నటించారు.. కానీ అంతగా ఆకట్టుకోలేదు.

రిచాకు నువ్వేకావాలి సినిమాతో మంచి మార్కులే పడ్డా.. ఆమె హీరోయిన్‌గా రాణించలేకపోయింది. దీంతో తెలుగులో సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. తెలుగులో హోలీ, నా మనసిస్తారా, పెళ్లాం పిచ్చోడు, ఇంకోసారి వంటి చిత్రాల్లో నటించిది. అటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ వెళుతోంది. అంతేకాకుండా బుల్లితెరపై కూడా మెరుస్తోంది. 2016 నుండి వెండితెరకు దూరమై బుల్లితెరపై కనిపిస్తోంది. మలుపు చిత్రం తర్వాత ఆమె బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. యువర్ హానర్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది అమ్మడు. ఆమె సన్నీ బజాజ్ అనే వ్యక్తిని మనువాడింది. వీరికి ఓ కుమారుడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది రిచా. అప్పట్లో ముద్దు ముద్దుగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా మారిపోయి కనిపిస్తుంది. కానీ అప్పటి కంటే ఇప్పడు మరింత గ్లామరస్ లుక్స్‌లో కట్టిపడేస్తోంది.  మన కళ్లను మనం నమ్మలేని అంతగా మారిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి