iDreamPost

NTR: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలో నెగిటీవ్ పాత్రలో తారక్..?

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘దేవర’. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తారక్ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘దేవర’. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తారక్ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

NTR: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలో నెగిటీవ్ పాత్రలో తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సముద్రం బ్యాక్ ట్రాఫ్ లో సాగే ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఉన్నారు. ముఖ్యంగా తారక్ అభిమానులు అయితే కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్ వంటివి సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శత్వంలో డ్రాగన్ మూవీలో నటించనున్నారు. ఈ సందర్భాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్ డేట్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు  చూద్దాం…

మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘దేవర’. ఈ పేరు వింటేనే తారక్ అభిమానుల్లో గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు. తొలి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే.. మరో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ తారక్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఈ మూవీకి “డ్రాగన్ ” అనే ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. డ్రాగన్ అంటే యూరోపియన్ భాషలో చెడుకి గుర్తు అని అర్థం. అలాగే డ్రాగన్ అంటే అలజడికి సంకేతం, నిప్పును పీల్చే గుణం కూడా ఉంటుందంట. దీనితో ఇలాంటి ఆసక్తిగా టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్ దర్శకుడు ప్రశాంత్ నీల్ నెగటివ్ రోల్ లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వెంటనే ప్రశాంత్ నీల్ మూవీని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి