iDreamPost
android-app
ios-app

భార్యపై అనుమానంతో బరితెగించిన భర్త.. ఏం చేశాడంటే?

భార్యపై అనుమానంతో బరితెగించిన భర్త.. ఏం చేశాడంటే?

నాగమణి, వెంకటేశ్వర్లు ఇద్దరు భార్యాభర్తలు. వీరికి 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు జన్మించాడు. అయితే భర్త స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తుండగా, భార్య ఇంటి దగ్గరే కుట్టు మిషన్ కుడుతూ కుటుంబాన్ని పోషించేవారు. అలా వీరి సంసారంలో ఏనాడు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవించారు. కట్ చేస్తే.. ఇటీవల వెంకటేశ్వర్లు భార్యపై అనుమానంతో ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తొర్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, జుజ్జూరు గ్రామానికి చెందిన నాగమణి (35)ని 18 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానం. అయితే కొంత కాలం పాటు వ్యవసాయం చేసిన వెంకటేశ్వర్లు.., ఆ తర్వాత స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనికి కుదిరాడు. భార్య మాత్రం ఇంట్లో కుట్టు మిషన్ కుడుతూ ఉండేది. అలా చాలా కాలం పాటు ఈ దంపతుల సంసారం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భర్త వెంకటేశ్వర్లు భార్య తీరుపై అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంపై తరుచు ఆమెతో గొడవకు దిగుతుండేవాడు. ఇదిలా ఉంటే.. బుధవారం అర్థరాత్రి ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.

ఇక కోపంతో ఊగిపోయిన భర్త వెంకటేశ్వర్లు.. ఇంట్లో ఉన్న గొడ్డలితో భార్య నాగమణిపై తీవ్రంగా దాడి చేయడంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సాయంతో ఈ విషయం తెలుసుకున్న నాగమణి తల్లి ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం ఆమె అల్లుడి దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అనుమానంతో భార్యను హత్య చేసిన ఈ భర్త కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet