iDreamPost

బాబు అరెస్ట్‌తో క‌థ ముగియ‌లేదు! అసలు టార్గెట్ అదే..

బాబు అరెస్ట్‌తో క‌థ ముగియ‌లేదు! అసలు టార్గెట్ అదే..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కీల్  డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నారా చంద్రబాబు అరెస్ట్ అంశం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొన్న చంద్రబాబు… ఎనాడు జైలు గడప తొక్కలేదు. అసలు ఆయన జైలు వెళ్తాడని ఎవరూ కల్లో కూడా ఊహించి ఉండరు.  అలాంటి వ్యక్తికి ఏకంగా కోర్టు బోను ఎక్కించి.. అరెస్ట్ చేశారు. అంతేకాక ఏకంగా 14 రోజులు  రిమాండ్ కూడా ఆయనకు ఏసీబీ కోర్టు విధించింది. అయితే చాలా మంది చంద్రబాబు అరెస్ట్ తో కథ ముగిసిందని భావిస్తున్నారు. అయితే అసలు కథ ఇక్కడి నుంచి మొదలైందని, టార్గెట్ వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలొ అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల రిమాండును విధించింది ఏసీబీ కోర్టు. దీంతో చంద్రబాబును రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. స్నేహా బ్లాక్‌లో ఆయనకు తగిన సౌకర్యాలు అందించడంతో పాటు ఇంటి నుండి భోజనం తెప్పించుకునేందుకు అనుమతినిచ్చారు. అయితే చంద్రబాబు..అరెస్టైన కొన్ని గంటల్లోనే బయటకు వస్తాడని  చాలామంది భావించారు. కానీ రోజులు గడుస్తున్నా.. ఆయన బయటకు రాలేదు.

చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది కేవలం ఆరంభమేనని, అసలు కథ ముందుందని, అందుకు తగినట్లే సీఐడీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనపై వివిధ రకాల కేసులో విచారించేందుకు కస్టడికి అనుమతివ్వలని కోర్టును అధికారులు కోరిన సంగతి తెలిసిందే.  అందుకే అమరావతి రింగ్ రోడ్ కుంభకోణం, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు లాయర్లు పిటిషన్ వేశారు. టిడ్కో ఇళ్లను ఇష్టాను సారంగా రేట్లను పెంచిందని, ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్ట్ కంపెనీల నుంచి డొనేషన్లు తీసుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ కేసుపై  కూడా ఆదాయపు పన్ను శాఖ నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది.  అలానే షాపూర్ జీ పల్లోంజీ, లార్సన్  అండ్ టూబ్రో  నుంతి విరాళాలు తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఈ కేసులో ఆగష్టు 4 చంద్రబాబు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారని ఓ నేషన్ మీడియా ప్రచురించింది. దీన్ని బట్టి ఇప్పటికే నమోదైన కేసులను మరింత వేగంతగా దర్యాప్తు చేయాలని ఏపీ సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇక చంద్రబాబు నాయుడు ఇప్పట్లో జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలు లేవని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఆరు నెలల పాటు జైల్లోనే ఉంటారని టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ లాయర్లు ఎనిమిది కేసుల్లో పీటీ వారెంట్‌లు వేశారని, ఇవి కాక ఇంకా కొత్త కేసులు లైన్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్ని వస్తే.. బాబు నెలల తరబడి జైల్లో గడపాల్సిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి