iDreamPost
android-app
ios-app

వీడియో: డ్రైవింగ్‌ నేర్చుకోవటం అంటే ఇదా.. మనుషుల్ని చంపేస్తారా?

వీడియో: డ్రైవింగ్‌ నేర్చుకోవటం అంటే ఇదా.. మనుషుల్ని చంపేస్తారా?

వాహనదారుల ర్యాష్‌ డ్రైవ్‌ కారణంగా ప్రతీ ఏటా వందల మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎవరో చేసిన తప్పుకు మరెవరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. కారు లేదా ఇతర వాహనాలు నేర్చుకునే ప్రయత్నంలో కొంతమంది ప్రమాదాలకు కారణం అవుతున్నారు. తాజాగా, ఓ యువతి కారు నేర్చుకునే ప్రయత్నంలో పెద్ద ప్రమాదానికి కారణమైంది. ఏకంగా మనుషుల మీదకు కారును పోనిచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాకు చెందిన ఓ యువతి గత కొద్దిరోజులుగా కారు డ్రైవింగ్‌ నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మొన్నీమధ్య మధ్యాహ్నం 1 గంట సమయంలో కారు నడుపుతూ బిజీ రోడ్డు మీదకు వచ్చింది. ఓ చోట కారు యూటర్న్‌ తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే, కారు అదుపు తప్పటంతో ఆమె బ్యాలెన్స్‌ కోల్పోయింది. కారు వేగంగా యూటర్న్‌ తిరిగి ఓ బిల్డింగ్‌ బయట నిల్చుని ఉన్న జనంపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డులు, ఇతర వ్యక్తులకు గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే వారిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూస్తున్న నెటిజన్లు సదరు యువతులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.