iDreamPost

పేదలకు అమరావతిలో నో ఎంట్రీ ..

పేదలకు అమరావతిలో నో ఎంట్రీ ..

పేద ప్రజలకు రాజధాని అమరావతి ప్రాంతంలో నో ఎంట్రీ అని దాదాపు తేలిపోయింది. చంద్రబాబునాయుడు కలలుకన్నా అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రయత్నంపై హై కోర్టు స్టే ఇచ్చింది. అమరావతి ప్రాంతంలోని రైతులు రాజధాని నిర్మాణం కోసమే భూములిచ్చారు కానీ పేదలకు గృహనిర్మాణం కోసం కాదని కోర్టు అభిప్రాయపడింది. పైగా ఇదే పాయింట్ మీద భూములిచ్చిన రైతులు కూడా కోర్టుల్లో కేసులు వేశారు.

రాజధాని నిర్మాణం కోసమనే తాము భూములిచ్చాం కానీ పేదలకు ఇళ్ళ స్ధలాలు కేటాయించటం కోసం కాదంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. రైతులు దాఖలు చేసిన కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. పేదలకు ఇళ్ళస్ధలాలు కేటాయించటానికి మార్పులు చేసిన రాజధాని మాస్టర్ ప్లాన్ అమలుకు కోర్టు అడ్డుకుంది. అలాగే కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో గృహనిర్మాణ పనులను కూడా వెంటనే ఆపేయాలంటూ కోర్టు ఆదేశించింది.

అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే భవిష్యత్తులో అమరావతి ప్రాంతంలో పేదలకు నో ఎంట్రీ అని అందరికీ అర్ధమైపోయింది. రాజధాని ప్రాంతంలో సుమారు 4 లక్షల మంది పేదలు నివసించటానికి ఏర్పాట్లు చేయాలనుకున్నది. ఇందుకు వీలుగా ఇళ్ళ పట్టాలు కేటాయించేందుకు దాదాపు 2500 ఎకరాలను కేటాయిస్తు ప్రభుత్వం ఈ మధ్యనే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 4500 పట్టాల పంపిణీకి కూడా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే రైతులు కోర్టులో వేసిన కేసు కారణంగా మొత్తం ప్రక్రియంతా ఎక్కడిదక్కడ నిలిచిపోయింది.

అమరావతి ప్రాంతంలో రైతుల ఆలోచనలు ఎలాగుందంటే తమ గ్రామాల్లో తాము తప్ప రాష్ట్రంలోని ఇంకెవరు అమరావతి ప్రాంతంలోకి వచ్చేందుకు వీల్లేదన్నట్లే ఉంది. ఇదే సమయంలో అమరావతి కేంద్రంగా చంద్రబాబు సామాజకవర్గంలోని కొందరి వ్యవహార శైలితో మిగిలిన సామాజికవర్గాల్లో తీవ్ర అసహనాన్ని పెంచేస్తోంది. అమరావతి అంటే చంద్రబాబు సామాజికవర్గంలోని కొంతమందికి గేటెడ్ కమ్యూనిటి లాగ తయారైపోయిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

నిజానికి మిగిలిన ప్రాంతాల్లోని జనాలకు అమరావతి మనందరిదీ అనే భావన ఎప్పుడూ లేదు. అందుకనే రాజధాని వికేంద్రీకరణ చేయటమే మంచిదని జగన్ అభిప్రాయపడ్డాడు. కర్నూలును జస్టిస్ క్యాపిటల్, వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ గా బాగుంటుందని జగన్ అనుకున్నాడు. దీనివల్ల రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని నమ్మాడు. పైగా చంద్రబాబు కలల రాజధాని నిర్మించాలంటే లక్షల కోట్లరూపాయలు కావాలి. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇది సాధ్యమయ్యే పనికాదు.

అందుకనే కొద్దిపాటి ఖర్చుతోనే మంచి రాజధాని అవ్వగలిగే స్ధాయి ఉన్న వైజాగ్ పై జగన్ దృష్టి పడింది. విజయవాడతో పోల్చుకుంటే విశాఖపట్నంకు రాజధానిగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకనే విశాఖకు రాజధానిని తరలిస్తే బాగుంటుందన్న జగన్ ఆలోచనను కూడా చంద్రబాబు అండ్ కో కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. సరే రాజధాని ఎక్కడుంటుందన్న విషయాన్ని పక్కనపెట్టేసినా అమరావతిలో అయితే పేదలకు నో ఎంట్రీ అన్న విషయం తేలిపోయింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి