iDreamPost

స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్‌కు సీఎం జగన్ గుడ్ న్యూస్!

Happy Newes GIG Workers ఏపీలో ఎన్నిలక నేపథ్యంలో అధికార పార్టీ 'YSRCP నవరత్నాలు ప్లస్' మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా గిగ్ కార్మికులకు శుభవార్త తెలిపింది.

Happy Newes GIG Workers ఏపీలో ఎన్నిలక నేపథ్యంలో అధికార పార్టీ 'YSRCP నవరత్నాలు ప్లస్' మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా గిగ్ కార్మికులకు శుభవార్త తెలిపింది.

స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్‌కు సీఎం జగన్ గుడ్ న్యూస్!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ‘YSRCP నవరత్నాలు ప్లస్’ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు సీఎం జగన్. ఈ మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు మేలు చేసే సామాజిక సేవలలు, కొత్త కార్యక్రమాలు ప్రవేశ పెడతామని హామీ ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు జగనన్న చేదోడు, ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుకు ఆర్థిక సాయం వంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వైసీసీ సర్కార్ కట్టుబడి ఉందని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా గిగ్ వర్కర్లకు శుభవార్త తెలిపింది జగన్ సర్కార్. వివరాల్లోకి వెళితే..

నేడు తాడేపల్లిలోని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ‘YSRCP నవరత్నాలు ప్లస్’రిలీజ్ చేశారు సీఎం జగన్. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానం నాపై చూపించి నన్ను సీఎంగా ఎన్నుకున్న ప్రజలకు ఎప్పుడు నాకు అండగానే ఉంటు వస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా మా ప్రభుత్వం ఎలాంటి సాకులు చెప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తూ వచ్చాం.గత ఎన్నికల్లో చాలా మంది రంగు రంగు కాగితాలపై హామీలు అంటూ ముందుకు వచ్చారు. కానీ ఏవీ అమల్లోకి రాలేదు. మా మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించాం.. అంతే గౌరవం ఇచ్చాం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి వద్ద మన మేనిఫెస్టో కాపీ ఉంటుంది.ఈ 58 నెలలు పథకాలన్నీ డోర్ డెలివరీ ద్వారా అందించాం.. మాట నిలుపుకున్నాం అన్నారు.

ఈ మేనిఫెస్టో లో రైతు, మహిళ, కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేశారు. 3 లక్షల మంది మహిళలకు సున్నా పైసా వడ్డీ రుణాలు అందిస్తామని, కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి కార్యక్రమాంలు కొనసాగిస్తామని, వైఎస్ఆర్ బీమా పథక గిగ్ కార్మికులు అనగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమాను అందిస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. విద్య, వైద్య, ఆరోగ్యం విషయంలో మెరుగైన సేవలు అందించే విషయంలో కొత్త ప్రణాళికలు సిద్దం చేసింది. అర్హులైన పేదలకు గృహాలు లేని వాళ్లందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. గణనీయ ఎస్సీ జనాభా అంటే కసీసం 500 ఇళ్లు ఉన్న గ్రామాల్లో ప్రత్యేక పంచయతీల ఏర్పాటు, వైఎస్ఆర్ విహార మిత్ర పథకంలో కారు డ్రైవర్లతో పాటు ట్రక్ డ్రైవర్లకు పది లక్షల ప్రమాద బీమా కవరేజ్ ఏర్పాటు చేశామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి