మరికొన్ని రోజుల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం మెుదలు కాబోతోంది. ఇక ఈ మెగా ఈవెంట్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ ప్రేమికులు. ఇప్పటికే మ్యాచ్ లకు సంబంధించి టికెట్లు కూడా కొనుగోలు చేసి రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వరల్డ్ కప్ కు ముందు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించడం లేదు. ప్రేక్షకులను మ్యాచ్ చూడ్డానికి అనుమతించకపోవడానికి కారణం ఏంటంటే?
ప్రపంచ కప్ లో భాగంగా జరిగే కొన్ని మ్యాచ్ లకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఇక వరల్డ్ కప్ ముందు నగరంలో ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి వామప్ మ్యాచ్ ఈనెల 29న పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ చూడ్డానికి ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదు. దానికి కారణం మ్యాచ్ కు ఒకరోజు ముందు నగరంలో గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు ఉండటమే. ఈ రెండు ఈవెంట్స్ కారణంగా తగినంత భద్రత కల్పించలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో నగరంలోని పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే వామప్ మ్యాచ్ తేదీని మార్చుకోవాల్సిందిగా పోలీసులు సూచించగా.. దీనిపై బీసీసీఐ-హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చర్చించాయి. ప్రధాన మ్యాచ్ కాకపోవడంతో.. సమస్యలేదని, డేట్ మార్చాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఈ విషయంలో తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి పాక్-న్యూజిలాండ్ మ్యాచ్ కు ప్రేక్షకులను అనుమతించకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Pakistan vs New Zealand warm-up match in Hyderabad will be played behind closed doors with lack of security due to festival day. [The Indian Express] pic.twitter.com/5HKIPxYKY7
— Johns. (@CricCrazyJohns) September 19, 2023