జీరో ఎఫ్ఐఆర్ ఇదొకటుందనే విషయం చాలా మందికి తెలీదు. నిజానికి చాలా మంది పోలీసులకే తెలీదు.
ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకంటే ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు పోలీసుల దగ్గరికి వెళితే అది మాపరిధి కాదుని శంశాబాద్ పరిధి అని, కాదు కాదు శంశాబాద్ రూరల్ పరిధి అని తిప్పారని మీడియాకి ప్రియాంక తల్లిదండ్రులు తెలిపారు.
ఈ సమస్య ఇప్పుడే కాదు. ప్రతి పోలిస్ స్టేషన్ లోనూ జరిగే ప్రహసనమే. పోలీసులు చాలా సందర్భాలలో బాధ్యత నుంచి తప్పుకోవడానికి మా పరిధి కాదు అనే ఆయుధాన్ని వాడుతుంటారు. నిజానికి ఇది తప్పు. మనమొక ఫిర్యాదుతో ఏ పోలిస్ స్టేషన్ కు వెళ్ళినా వారు తప్పకుండా ఆ ఫిర్యాదు తీసుకోవాలి. మా పరిధి కాదు అని వాళ్ళు అంటే జీరో ఎఫ్ఐఆర్ చెయ్యండి అని మనం అడగాలి. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాల్సిందే..
ఇంతకూ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి?
మన ఫిర్యాదు ఏ స్టేషన్ పరిధి లోదో తేలనపుడు మనం ఎక్కడైతే ఫిర్యాదు చేసామో అక్కడ జీరో ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి తరువాత సంబంధిత స్టేషన్ ఏదో తెలుసుకుని ఆ ఎఫ్ఐఆర్ ను ఆ స్టేషన్ కు పోలీసులు బదిలీ చేయాలి…ఇంకా చెప్పాలంటే ఏ పరిధిలోదో తెలిసినా సరే మనం ఫిర్యాదును వేరే స్టేషన్ లో చేసి జీరో ఎఫైఆర్ చేయండి అని అడిగితే అక్కడ నమోదు చేయాల్సిందే. ఇది నియమం. మా పరిధి కాదు అని ఏ పోలిస్ స్టేషనూ అనడానికి వీలు లేదు. జీరో ఎఫ్ఐఆర్ గురించి నిజానికి ప్రజల కంటే ముందు పోలిస్ ఆఫీసర్లే తెలుసుకోవాలి
నిజానికి 2012 లో జరిగిన నిర్భయ కేసు తరువాత క్రిమినల్ Law లో జస్టిస్ వర్మ కమిటీ రిపోర్ట్ రికమెండేషన్ మీద Zero FIR వచ్చింది. సుమారు 6 ఏళ్ళ నుండి ఉంది.. GO తో పాటు Gazette కూడా వస్తుంది … Gazette లో కూడా వచ్చింది అంటే entire Indian community should know it..that’s it . పోలీసులకి తెలియదు అంటే నమ్మశక్యం కాదు. లేదా ఆ పోలీస్ కావాలని కేసు తప్పించడానికి చేసిన పని అయ్యి ఉండాలి. రేప్ నిందితుడితో పాటు ఆ పోలీస్ కి కూడా శిక్ష పడాలి మరి.
Ignorance of law is not excuse. పైగా dereliction of duty క్రింద వస్తుంది. రెండు, IPC Section 166A ప్రకారం మహిళల పైన జరిగిన అఫెన్సు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యకపోతే శిక్షకి అర్హుడే . If it’s every man’s business to see justice done ముందుఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకొనని పోలీస్ ని శిక్షించి, ఆ తరువాత క్రైమ్ చేసిన వాళ్ళని శిక్షించాలి