Idream media
Idream media
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెంటిమెంట్ కలిసి వచ్చింది. ఆయన ఆద్వర్యంలోనే హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. అందుకే నిమ్మగడ్డ తన సెలవులను రద్దు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు వైసీపీ బాగా కలిసొచ్చింది. వద్దు వద్దు అంటున్నా.. వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించినా.. కోర్టుకు వెళ్లి మరీ పంచాయతీ ఎన్నికలు, తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. కారణం ఏదైనా ఆ రెండు ఎన్నికలు అసలు వద్దే వద్దు అంటూ ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ ఫలితాలు మాత్రం ఎవ్వరూ ఊహించని రీతిలో వచ్చాయి.. ఓటమికి భయపడే వైసీపీ ఎన్నికలు వద్దంటూ వ్యతిరేకించిందని విపక్షాలు ఆరోపించాయి. తీరా ఫలితాలు అందరికీ షాక్ ఇచ్చాయి. వార్ ను వన్ సైడ్ చేశాయి.
Also Read:మహిళలకు పట్టం.. జగన్ ప్రభుత్వం మరో సంచలనం
వరుస రెండు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ రావడంతో.. ఆ సెంటిమెంట్ వైసీపీకి బాగ కలిసోచ్చింది. అందుకే ముచ్చటగా మూడో ఎన్నిక కూడా ఆయన చేతులు మీదే జరిపిస్తే మరో భారీ విజయాన్ని నమోదు చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. అందుకే ఎస్ఈసీ నిమ్మగడ్డ తన సెలవులను రద్దు చేసుకోవాలని వైసీపీ వర్గాలు పట్టుపడుతున్నాయి. త్వరగా పరిషత్ ఎన్నికలను నిర్వహించడపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఎస్ఈసీ నిమ్మగడ్డతో ప్రభుత్వం మంతనాలు జరుపుతుంది. తాజాగా ఎస్ఈసీతో సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ భేటీ అయ్యారు. పరిషత్ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డను సీఎస్ దాస్, అనిల్ కుమార్ సింఘాల్ కోరారు.
వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే నెలాఖరులోగా పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయవచ్చు అని సీఎస్ దాస్ పేర్కొన్నారు. ఎన్నికలు ముగిస్తే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టొచ్చని ఎస్ఈసీకి వివరించారు రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని.. అందుకే త్వరగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడమే మేలు అని సీఎస్ అభిప్రాయపడ్డారు. అయితే పరిషత్ ఎన్నికల నిర్వహణపై తన అభిప్రాయాన్ని వివరించారు ఎస్ఈసీ. దాంతో పాటు ఎస్ఈసీ-సీఎస్ భేటీలో ప్రివిలేజ్ కమిటీ నోటీసుల ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.
Also Read:ఆ నియోజకవర్గంలో గత పాతికేళ్లుగా గెలిచినోళ్లు,ఓడినోళ్లు అందరూ ఒకే గూటికి చేరారు..!
పురపాలక ఎన్నికల్లో ఏది జరిగినా పారదర్శకంగా, ప్రజల ఇష్టం మేరకే వ్యవహరించాలని సీఎం ఆదేశించారని అన్నారు. అనుకూలంగా లేని చోట్ల ఎవరినీ ప్రలోభాలకు గురి చేయవద్దని సీఎం ఆదేశించారు. కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీ మాకు కలసి వచ్చిందని, తాడిపత్రి లో సభ్యుల ఇష్టప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు.
రిజర్వేషన్ల విషయంలో సీఎం వైఎస్ జగన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించారన్న ఆయన మొత్తం 78 శాతం మందిని బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు మేయర్, ఛైర్మన్ స్థానాల్లో నియమించారని అన్నారు. దేశ చరిత్రలోనే ఇది అరుదైన సన్నివేశం అని, 86 పదవులకు చట్ట ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 45 పదవులు ఇవ్వాల్సి ఉండగా 67 మందికి ఇచ్చారని అన్నారు. 70 శాతం పైగా ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీలకు చట్టంలో లేకపోయినా అదనంగా రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. బీసీలు,మైనార్టీలకు చట్ట ప్రకారం 30 స్థానాలు ఇవ్వాల్సి ఉండగా సీఎం జగన్ 52 స్థానాలు ఇచ్చారని, బీసీ లకు- 40 మందికి అంటే 46.51శాతం మందికి పదవులు ఇచ్చామని అన్నారు.