iDreamPost
android-app
ios-app

వైస్సార్ రైతు భరోసా ద్వారా 43 లక్షల రైతులకు సాయం

వైస్సార్ రైతు భరోసా ద్వారా 43 లక్షల రైతులకు సాయం

వైస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న, 43 లక్షల రైతులకు సాయం అందించామని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. వైస్సార్ రైతు భరోసా కు కౌలు రైతులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా మరొక నెల గడువు పెంచామని అన్నారు. పత్తి కొనుగోలు కోసం సిసిఎ కేంద్రాలు ఏర్పాటు చేశామని త్వరలో వేరుశనగ కోసం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు. పొలంబడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అపరాల బోర్డును ఏర్పాటు చేస్తామని వాటికి గిట్టుబాటు ధరకూడా కల్పిస్తామని పేర్కొన్నారు . మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన గుడ్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని దానికి సంబంధించిన టెండర్లలో నేరుగా రైతులే పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వైస్సార్ రైతుభరోసాలో భాగంగా రైతులకు రూ.13,500/-పెట్టుబడి సాయం ప్రభుత్వం తరపున అందిస్తారు. ఇది మూడు దఫాలుగా రైతులకు అందుతుంది. మొదటి విడతగా మే నెలలో రూ.7500/- రెండో విడతగా అక్టోబర్ నెలలో రూ.4000/ ,మూడవ విడతగా జనవరిలో రూ.2000/-లను, రైతుల బ్యాంకు అకౌంట్స్ కి నేరుగా బదిలీ చేస్తారు.