ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మరో హామీ అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించిన న్యాయవాదులకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ప్రాక్టీస్‌లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం ఉన్న న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్‌లో నమోదైన న్యాయవాదులు 61వేల మంది ఉన్నారు. ఏటా కొత్తగా 1,500 మంది ఎన్‌రోల్ అవుతున్నారు.
దరఖాస్తు…
https://ysrlawnestham.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు ఆధార్ నంబర్‌ను జత చేయాలి. స్టైఫండ్ ఏ బ్యాంకు ఖాతాలో జమ కావాలని కోరుకుంటున్నారో ఆ వివరాలు అందజేయాలి.