iDreamPost
iDreamPost
ఎల్లోమీడియా మొదటిపేజిలో బ్యానర్ గా వచ్చిన కథనాన్ని చూస్తుంటే ఇదే అనుమానం పెరుగుతోంది. రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో టిడిపి పాల్పడిన ఇన్ సైడర్ ట్రేడింగ్ బట్టబయలవ్వటంతో చంద్రబాబు అండ్ కో చేసిన భూదోపిడి అందరికీ తెలిసి పోయింది. దాని మనసులో పెట్టుకుని ఇపుడు ’పేదలకు ఇళ్ళు… పెద్దలకు కోట్లు’ అంటూ బ్యానర్ కథనం వచ్చిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
తన కథనంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేందుకు మూడు ఉదాహరణలిచ్చింది. దాంతో ఈ కథనంపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ అవేమిటంటే ఈ గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసే ప్రాంతాన్ని ముందుగానే తెలుసుకున్నాడట. ఎకరం రూ. 45 లక్షలకు 10 ఎకరాలు కొనుగోలు తర్వాత అదే ఎకరాన్ని రూ. 90 లక్షలకు ప్రభుత్వానికే అమ్మారట.
అలాగే కృష్ణా జిల్లాలోని వణుకూరుకు చెందిన ఓ రైతు తన భూములను ప్రభుత్వానికి అమ్మాడట. అందుకు గాను ప్రభుత్వం నుండి డబ్బులు కూడా తీసుకున్నాడట. అయితే ఇక్కడే ఓ నేత ఎంటరై తనకు కోటి రూపాయలు కమీషన్ గా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. ఇవ్వనంటే వెంటనే పోలీసులు రంగంలోకి దిగేశారట. దాంతో హైదరాబాద్ లోని తన ఫ్లాటును నేత బంధువుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల్సొచ్చిందట సదరు రైతు.
తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలో ఇళ్ళ స్ధలాల కోసం 248 ఎకరాలను అధికారులు సేకరించారట. ఇక్కడ ఎకరా ధర రూ. 20 లక్షలుంటే అధికారులు మాత్రం 45 లక్షలు వెల కట్టారట. ఇందులో 190 ఎకరాలు అధికారపార్టీకి చెందిన నేతలదేనట. పైగా ఈ ప్రాంతంలో భూములన్నీ ముంపునకు గురయ్యేవే అని తెలిసినా ప్రభుత్వం కొనేసిందని కథనంలో ఎల్లోమీడియా చెప్పింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే డెల్టా ప్రాంతంలో ఎకరాను అధికారపార్టీ మద్దతుదారులు రూ. 45 లక్షలకు కొని రూ. 90 లక్షలకు అమ్మారని చెప్పింది. అయితే అమ్మిన వాళ్ళెవరో చెప్పలేదు. సరికదా కొన్నవాళ్ళెవరో కూడా చెప్పలేదు. టిడిపి హయాంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ విషయంలో వైసిపి సర్వే నెంబర్లు, కొనుగోలు చేసిన టిడిపి ప్రముఖుల పేర్లను కూడా చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. కనీసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరణ కూడా ఇవ్వలేదు. దాంతో ఎల్లోమీడియాలో వచ్చిన కథనంపై అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఇక కృష్ణ జిల్లాలోని వణుకూరులో రైతు తన భూములను ప్రభుత్వానికి ఇచ్చినందుకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చిందట. ఇందులోకి ఓ నేత ఎంటరై తనకు కోటి రూపాయలు కమీషన్ ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చాడని రాసింది. ఎవరో రైతు దగ్గర ప్రభుత్వం భూములు తీసుకుని పరిహారం ఇస్తే మధ్యలో సంబంధం లేని నేత ఎంటరవ్వటం ఏమిటి ? కోటి రూపాయల పరిహారం కోసం డిమాండ్ చేయటమేంటి ?
రైతు భూములను ప్రభుత్వంతో సదరు నేత కొనిపిస్తే రియల్ ఎస్టేట్ పద్దతిలో మధ్యలో కమీషన్ డిమాండ్ చేశాడని చెప్పినా అర్ధముంది. భూములిచ్చింది రైతు పరిహారం చెల్లించింది ప్రభుత్వం. మధ్యలో నేత ఎవరో కోటి రూపాయల కమీషన్ డిమాండ్ చేశాడని చెప్పటమంటే ఆశ్చర్యంగా ఉంది. అంత భారీ ఎత్తున పరిహారం అందుకున్న రైతు అమాయకంగా ఒత్తిళ్ళకు లొంగిపోయి హైదరాబాద్ లోని ఫ్లాట్ రాసిచ్చేశాడంటే నమ్మేట్లుగా లేదు. ఒకవేళ అదే నిజమైతే నేత పేరును ఎల్లోమీడియా ఎందుకు బయటపెట్టలేదు ? చిన్న చిన్న విషయాల్లోనే వైసిపి నేతల పేర్లు బయటపెట్టేసే ఎల్లోమీడియా ఇంత పెద్ద వ్యవహారంలో సదరు నేత పేరు బయటపెట్టలేదంటే అనుమానంగా ఉంది.
చివరగా కోరుకొండ మండలంలో ఎకరా ధర రూ. 20 లక్షలుంటే అధికారులు మాత్రం రూ. 45 లక్షలు వెలకట్టారని చెప్పింది. అధికారులు ఎవరిష్ట ప్రకారం వాళ్ళు ధరలు కట్టేందుకుండదు. భూ సేకరణలో పరిహారంగా ఎంత ధరలు ఇవ్వాలనేందుకు ఓ పద్దతుంటుంది. పోనీ ప్రభుత్వం భూములు కొనేసిందంటే కూడా అక్కడి రిజిస్ట్రేషన్ ధర ప్రకారమే ధరలు చెల్లించాల్సుంటుంది. పైగా కొనుగోలు చేసిన భూముల్లో 190 ఎకరాలు అధికారపార్టీ నేతలవేనట. అధికారపార్టీ నేతలకు భూములుండకూడదని, ఉన్నా వాళ్ళ భూములు ప్రభుత్వం కొనకూడదన్నట్లుగా ఉంది కథనం.
మొత్తం మీద టిడిపి హయాంలో అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వమే అనేక వివరాలను బయటపెట్టింది. ఇందులో భాగంగా అనేక సాక్ష్యాలను సేకరిస్తోంది. దాంతో చంద్రబాబు అండకో భారీ ఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ లో వేల కోట్లరూపాయల లబ్ది పొందారని జనాలు నమ్ముతున్నారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని ఎల్లోమీడియా చంద్రబాబు ప్రయోజనాలే లక్ష్యంగా ప్రభుత్వంపైన కూడా తన మార్కు ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు గుప్పిస్తోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు జనాలకు క్లారిటి ఇస్తే బాగుంటుంది.