iDreamPost
android-app
ios-app

Akividu Result – ఆకివీడును కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ

  • Published Nov 17, 2021 | 5:31 AM Updated Updated Nov 17, 2021 | 5:31 AM
Akividu Result – ఆకివీడును కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు తొలి ఫలితం వెలువడింది. 12 వార్డులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. పదవ వార్డులో జనసేన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ కౌంటింగ్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ 20 వార్డులకు 26,285 ఓట్టు ఉండగా, 20,959 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు.

స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కౌంటింగ్‌ జరుగుతుంది. ఇందుకుగాను అధికారులు మొత్తం 20 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని వార్డుల్లోను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుంది. గెలుపు కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడి వార్డులను పంచుకున్న విషయం తెలిసిందే. టీడీపీ 13 వార్డుల్లో పోటీ చేయగా, జనసేన 5, సీపీఎం 2, బీజేపీ మద్దతుతో ఒకరు చొప్పున పోటీ పడ్డారు.

జగ్గయ్యపేటలో ఫ్యాన్‌ హవా

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. మెజార్టీ వార్డుల్లో ఫ్యాన్‌ దూసుకుపోతుంది. ఇప్పటికే పది వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ కేవలం మూడు వార్డుల్లో మాత్రమే ఆధిక్యతలో ఉంది. కౌంటింగ్‌ సరళి పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించనుంది. ఇక్కడ మొత్తం 31 వార్డులకు గాను 78.78 శాతం ఓటింగ్‌ నమోదయ్యింఇ. మొత్తం 62 పోలింగ్‌ బూత్‌లకు సంబంధించి 16 టేబుళ్లను ఏర్పాటు చేశారు. స్థానిక సామినేని విశ్వనాథం ఆడిటోరియంలో ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతుంది.

కొండపల్లిలో టీడీపీకి మూడు వార్డులు..

కొండపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఐదు వార్డుల్లో ఆధిక్యత సాధించగా, వైఎస్సార్‌సీపీ మూడు వార్డులలో ముందజలో ఉంది. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి ముందజలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 29 వార్డులున్నాయి.

Also Read : Kuppam Result : కుప్పంలో దూసుకెళుతున్న వైసీపీ