iDreamPost
android-app
ios-app

“బస్తీ మే సవాల్” అశోక్ పై వీరభద్ర స్వామి వీరతాండవం.

“బస్తీ మే సవాల్” అశోక్ పై వీరభద్ర స్వామి వీరతాండవం.

మూడు లాంతర్ల కట్టడం కూల్చివేతపై స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి స్పందించారు. ఆధునీకరణ నిమిత్తం తొలగించిన ‘మూడు లాంతర్ల ‘ స్థలంలో కొత్త పైలాన్ నిర్మాణానికి స్వామి శంకుస్థాపన చేశారు. ఆ తరువాత ఆయన పూసపాటి వంశీయుడు , మాజీ ఎంపీ అశోక్ గజపతి మీద నిప్పులుగక్కారు. ఆవేశం తో ఊగిపోతూ మాటల తూటాలతో అశోక్ గజపతి కి ప్రశ్నలు సంధించారు

“మూడు లాంతర్ల కట్టడం ఒక ట్రాఫిక్ ఐలాండ్ మాత్రమే. అది చారిత్రక కట్టడం కానే కాదు. స్వాతంత్ర్య సమర యోధులు కట్టింది అంత కంటే కాదు. బుద్ధి ఉందా ?. ఏం మాట్లాడుతున్నావో తెలుసా ?. పీవీజీ కొడుకుగా తప్ప నీకున్న అర్హత ఏంటి ?. మూడు లాంతర్లు కట్టడం పూసపాటి వంశీయులు కట్టించారా ? .లేక స్వాతంత్ర్య సమర యోధులు కట్టారా ?. ఆధారాలు ఉంటే చూపించండి. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా . లేకపోతే మీరు ప్రజలకు క్షమాపణ చెబుతారా ?. దీనిపై నేను బహిరంగ చర్చకు సిద్ధం. మీరు సిద్ధమేనా ?. ఫూల్ బాగ్ లో పురాతన కట్టడాన్ని , కోటలో మోతీ మహల్ ను ఎందుకు కూల్చారు?. వయసు ఉడిగాక ఇంటి పట్టున కూర్చోక ఎందుకీ ప్రేలాపనలు ?. కరోనా పేరిట రెండు నెలలు తాళాలు వేసేసి బంగ్లా లో మూసుకుని పడుకున్న నువ్వు ఇప్పుడొచ్చి రాజకీయం చేస్తావా ?. విద్యా దానం చేసిన స్వర్గీయ పీవీజీ కి మేమంతా బద్ధులమే. కానీ నీకు కాదు. కాబోము కూడా. ఎందుకంటే , నువ్వు ఏనాడూ ఎవరికీ ఒక్క రూపాయి దానం చెయ్యలేదు. ఇంతకు ముందు ఎన్ని విపత్తులు వచ్చినా , తాజాగా కరోనా విలయ తాండవం చేసినా , చేస్తున్నా ఒక్క లక్ష అయినా ఇచ్చావా ?. గంట స్తంభం సైరన్ ఆగిపోతే మోగించలేని నువ్వా ప్రశ్నించేది ?. కరోనా నేపథ్యంలో కూడా రెండు నెలలుగా ప్రజల మధ్య లోనే ఉన్నా. ఉంటున్నా. ఉంటాను కూడా. కానీ నువ్వేం చేశావు ?. ఇప్పుడొచ్చి పాలాభిషేకం , కొవ్వొత్తులు వెలిగించావు. అధికార దర్పంతో కోట కందకం చుట్టూ ఫెన్సింగ్ వేయించడం నిజం కాదా ? . మూడు లాంతర్ల కట్టడాన్ని సుందరీకరణ చేస్తామని ఈ ఏడాది ఫ్రిబ్రవరి 16వ తేదీన ఓ ప్రధాన పత్రిక లో వార్త ప్రచురితమైన సంగతి మీకు గానీ మీ వంది మాగధులకు గానీ తెలియదా?. తెలిస్తే అప్పటి నుంచి ఊరుకుని ఇప్పుడెందుకు గోల చేస్తున్నారు ?. రాజులనే పేరు చెప్పి ఎంత కాలం ఇలా రాజకీయం చేస్తారు ?. ఇప్పటికైనా దమ్ముంటే నిరూపించు. లేకపోతే మూసుకుని బంగ్లా లో పడుకో. అంతే గానీ మా తాతలు నేతులు తాగారనే సొల్లు కబుర్లు వద్దు “. జరిగింది ఇదీ. మరి రాజా వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.