పంచాయతీ రెండో దశ ఎన్నికల్లోనూ వైసీపీ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తున్నారు. ప్రతి జిల్లాల్లోనూ వైసీపీ మద్ధతుదారులు భారీ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. ఈ రోజు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 539 పంచాయతీలు ఏకగ్రీవం కాగా రెండు మినహా మిగతా 2,786 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 81 శాతం మేర పోలింగ్ నమోదైంది.
మధ్యాహ్నం మూడున్నర గంటలకు పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత కౌటింగ్ ప్రారంభమైంది. రాత్రి 11 గంటల సమయానికి వెల్లడైన ఫలితాల్లో ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ మద్ధతుదారులు 1,854 చోట్ల, టీడీపీ మద్ధతుదారులు 200 పంచాయతీల్లో, బీజేపీ–జనసేన కూటమి బలపర్చిన అభ్యర్థులు 14 చోట్ల, స్వతంత్రులు 38 పంచాయతీలలో విజయం సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటి వరకు 3,328 పంచాయతీలకు గాను 2,106 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి.
కౌటింగ్ ఇంకా జరుగుతోంది. ఓట్లు ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో లెక్కింపు ఆల్యసం అవుతోంది. వార్డుల ఫలితాలు వెల్లడించిన తర్వాత.. సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. తెల్లవారుజాము నాటికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.