Idream media
Idream media
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ అక్రమాలు ప్రకాశం జిల్లా లోను సాగాయి. గత ఐదేళ్లుగా నకిలీ వే బిల్లులతో వేలాది లారీల గ్రానైట్‌ను రాష్ట్రం దాటించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. నకిలీ కంపెనీలు సృష్టించి వే బిల్లులు అమ్ముకున్న ముఠా తెలిపిన వివరాలతో ప్రకాశం జిల్లా పోలీసులు నివ్వెరపోయారు. గుంటూరు జిల్లా పల్నాడులో మైనింగ్ మాఫియాను నడిపి రూ.వేల కోట్లు దోచుకున్న యరపతినేని తన అనుచరుడు సీఎం (నిక్‌నేమ్) అనే వ్యక్తి ద్వారా ప్రకాశం జిల్లాలో సైతం గ్రానైట్ మాఫియాను ఏర్పాటు చేశారు. ఈ అక్రమ వ్యవహారంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల్లోని కొందరు అధికారులు భాగస్వాములయ్యారు. మార్టూరు ఎస్‌ఐ విచారణలో భారీ కుంభకోణం బయటపడటంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.