అప్పట్లో తితిదే వాళ్ళు అహోబిలం మఠం వాళ్లకు చాలా సార్లు ఉత్తరాలు రాసారంట… మూడవ కన్ను ఉన్న నరసింహ స్వామి విగ్రహాన్ని చూసారా అని…
విషయం ఏమంటే అన్నమయ్య కీర్తన “ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా” లో వర్ణించిన స్వామి కోసం…
ఈ కీర్తన మీరు అన్నమయ్య సినిమాలో చూసి ఉంటారు.. సాళువ నరసింహ రాయలు తన మీద పాటలు కట్టనన్న అన్నమయ్యను బంధిస్తే ఈ కీర్తన ఆలపిస్తాడు…
సరే సమయం గడుస్తూ ఉంది… ఎవరికి ఆ సత్సంకల్పం కలిగిందో… ఒక రాళ్ల గుట్టను ఆలయంగా మార్చారు… నిజానికి ఆ రాళ్లగుట్ట ఒక చిన్న ఆలయం… నవనారసింహుల పేర వెలసిన ఆలయాల్లో ఒకటి.. ఈ స్వామిని కారంజ నరసింహ అంటారు… కానుగుమాని కింది నరసింహుడని ఒక కీర్తనలో (నవమూర్తులైనట్టి నరసింహము)అన్నమయ్య వర్ణించాడు..
కానుగు మాను కింద స్వామి హనుమంతుడి దర్శనం ఇచ్చాడని… నువ్వు నా స్వామివి కాదన్న ఆయనకు ధనుర్భాణాలతో స్వామి దర్శనం ఇచ్చాడని కథనం…
ఈ ఆలయం ఎగువ అహోబిలం.. అంటే ఉగ్ర నరసింహ ఆలయానికి వెళ్లే దారిలో ఒక కిలోమీటర్ ముందే దారి పక్కగా ఉంటుంది.
మొత్తానికి రాళ్లగుట్ట తీసి ఆ విగ్రహాన్ని శుభ్రం చేసినప్పుడు ఆ మూడో కన్ను ఉన్న విషయం తెలిసింది.
ఇక ఈరోజూ యాదగిరి అర్చకులు స్వామి సింధూరలేపాన్ని తొలగించాము తప్ప మరే మార్పులు చేయలేదంటున్నా ఈ పేపర్లో నానాయాగీ చేస్తున్నారు..
“శాంత మూర్తికి ఉగ్ర రూపం” హెడ్డింగుతో ఆంధ్రజ్యోతి పెద్ద వార్త రాసింది.60,70 సంవత్సరాలుగా స్వామివారికి సింధూరం మందంగా పట్టుకోవటం వలన స్వామివారి రూపం కనపడలేదని , ఇప్పుడు సింధూరం తొలగించటం వలనే స్వామివారి మీసాలు బయటపడ్డాయని ఆలయ అర్చకులు చెప్పినా ,ఉగ్రరూపం కోసం మూలవిరాట్ విగ్రహాన్ని చెక్కారని రాశారు. ఎదో రకమైన సంచలనానికి అలవాటుపడ్డ ఆంధ్రజ్యోతికి టీటీడీ తరువాత యాదాద్రి మీద వార్తల వండటం మొదలుపెట్టింది.
Also Read :నేవీ డే – ఘాజీ
భక్తి, శరణాగతి ప్రధానం కానీ శాంతమూర్తి, ఉగ్రమూర్తి, యోగమూర్తి ఎవరైతేనేం… వరాలివ్వరా??
ఎందుకీ రచ్చ!!! — Gopireddy Srinivas Reddy