iDreamPost
android-app
ios-app

ఆమె బిక్షగత్తె కాదు కోటీశ్వరురాలు…

ఆమె బిక్షగత్తె కాదు కోటీశ్వరురాలు…

కొందరు బిక్షగాళ్ళు కేవలం బిక్షాటన చేస్తూ లక్షలు సంపాదించారన్న వార్తలను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ కేవలం బిక్షాటన చేస్తూనే కోట్లకు పడగలెత్తింది ఓ యాచకురాలు. దీంతో ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

వివరాల్లోకి వెళితే నఫీసా అనే మహిళ ఈజిప్టులోని పలు ప్రావిన్స్‌ల్లో గత కొంతకాలంగా వీల్‌ఛైర్‌లో కూర్చొని దివ్యాంగురాలిగా నటిస్తూ భిక్షాటన చేస్తోంది. పక్షవాతం కారణంగా ఒక కాలు పోగొట్టుకున్నానని ప్రజలకు చెప్తూ బిక్షాటన చేసేది. ప్రజలు కూడా తమకు తోచిన ఎంతో కొంత మొత్తాన్ని ఆమెకు సహాయం చేసేవారు. కాగా ఈమె సాయంత్రం కాగానే వీల్ చైర్ వదిలేసి ఎంచక్కా నడుచుకుంటూ ఇంటికి వెళ్లిపోయేది. ఈ విషయాన్ని గమనించిన కొందరు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అవయవాలు బాగానే ఉన్నా దివ్యాంగురాలిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తోందన్న కారణంతో ఆమెను విచారించిన పోలీసులకు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి.

ఆమె పక్షవాతం కారణంగా కాలు కోల్పోవడం అసత్యమని పోలీసులు గుర్తించారు. ఆమెకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు నివాస భవనాలు ఉన్నాయని ఆమెకు చెందిన రెండు బ్యాంక్ ఖాతాలలో కోట్ల రూపాయల మొత్తం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. యాచకురాలిగా నటిస్తున్న నసిఫాకు గర్బియా, ఖలిబుయా గవర్నరేట్స్‌లో ఐదు నివాస భవనాలు బ్యాంక్ ఖాతాల్లో 3 మిలియన్‌ ఈజిప్షియన్‌ పౌండ్స్‌(దాదాపు రూ.1.42కోట్లు) ఉన్నట్లు తేలడంతో ఆమె ఇంత మొత్తాన్ని బిక్షాటన ద్వారానే సంపాదించిందా లేక వేరే మార్గాల ద్వారా సంపాదించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కోట్లకు పడగలెత్తినా సరే నసిఫా ఇంకా బిక్షాటన చేయడం వెనుక ఉన్న కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.