iDreamPost
iDreamPost
ఇవాళ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా క్లైమాక్స్ ని రాత్రి 9 గంటలకు కొత్త ఆన్ లైన్ థియేటర్ ద్వారా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే . ట్రైలర్ ని బట్టి ఇది స్ట్రిక్ట్ గా అడల్ట్ కంటెంట్ అని అర్థమవుతోంది. మియా మాల్కొవా అందాలనే హై లైట్ చేస్తూ వర్మ తీసిన ఈ 90 నిమిషాల చిత్రం మీద ఎవరికీ భారీ అంచనాలు లేవు కాని ఇది చూడాలంటె ఒక వ్యూకు 100 రూపాయలు చెల్లించాలని రేట్ పెట్టడం ఇప్పుడు సర్వత్రా దారి తీస్తోంది. ఎందుకంటే ఓటిటి సంస్థలు ఇప్పటిదాకా నెల లేదా ఏడాది చొప్పున చందా వసూలు చేస్తూ ఏ కంటెంట్ అయినా ఒక ఐడితో నాలుగు డివైజెస్ లో చూసేలా వెసులుబాటు కలిగిస్తున్నాయి.
నెట్ ఫ్లిక్స్ ఈ రంగంలో అత్యధికంగా సొమ్ములు తీసుకుండగా ప్రైమ్ చాలా రీజనబుల్ గా 999 రూపాయలకు మూడు వందల అరవై రోజులు ఎలాంటి నిబంధనలు లేకుండా అన్ని బాషలకు సంబంధించి అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తోంది. అంటే రోజుకు నాలుగు రూపాయల కంటే తక్కువే అవుతుంది. ఇక కొత్తగా వచ్చిన ఆహా లాంటి యాప్స్ కేవలం 365 తీసుకుంటున్నాయి. ఇది చాలా చీప్. కాని వర్మ ఒక్క సినిమా ఒక్కసారి చూసేందుకు 100 రూపాయలు ఇమ్మంటున్నారు. ఒకవేళ ఇదేదో మోడల్ బాగుందని అందరూ ఇదే తరహాలో ఆలోచిస్తే అప్పుడు చిల్లు పడేది ప్రేక్షకుల జేబులకే. స్టార్ హీరోల సినిమాలకు అయితే అభిమానులు ఆలోచించరు కాని మిగిలిన వాటిని ఈ మోడల్ అంత ఈజీగా వర్క్ అవుట్ అయ్యేది కాదు.
నిజానికి డైరెక్ట్ ఓటిటి రిలీజులకు వస్తున్న సినిమాలకు విడిగా డబ్బులు ఛార్జ్ చేస్తే ఎలా ఉంటుందన్న అంతర్గత చర్చల్లో సదరు సంస్థలు ఇప్పటికే పలుకోణాల్లో విశ్లేషిస్తున్నాయట. పొరపాటున ఇది మిస్ ఫైర్ అయితే సబ్స్క్రైబర్స్ ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి అంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువే. మరోవైపు లాక్ డౌన్ సడలించారు కాబట్టి జన జీవనం క్రమంగా నార్మల్ అవుతోంది. ఇళ్ళలో నుంచి ప్రజలు బయటికి వచ్చి తమ తమ పనులు, వ్యాపారాల్లో బిజీ అయిపోయారు. కాబట్టి ముందులాగా రోజంతా టీవీలు స్మార్ట్ ఫోన్లలో ఉండే అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ వర్మ స్ట్రాటజీ కనక ఫలించి వంద రూపాయలను లెక్క చేయకుండా అధిక శాతం ప్రేక్షకులు కనక క్లైమాక్స్ చూస్తే అప్పుడేమైనా మార్పులు జరగవచ్చు. ఇప్పటికైతే ఓటిటి యాజమాన్యాలు తమ ఆలోచనలు పెండింగ్ లోనే పెట్టారు. ఆచరణలోకి రావాలంటే ఎవరో ఒకరు దాన్ని ప్రూవ్ చేయాలి. మరి అది వర్మనే అవుతారా. చూద్దాం.