Swetha
భారీ బడ్జెట్ కాకపోయినా భారీ అంచనాల మధ్యన వచ్చిన సినిమా మిరాయ్. ప్రమోషనల్ కంటెంట్ ఎంత వైరల్ అయిందో.. ప్రీమియర్స్ మొదలు మొదటి రోజు షోస్ కంప్లీట్ అయ్యేవరకు వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే వైరల్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను కంప్లీట్ గా ఎంగేజింగ్ గానే ఉంచింది. ఎక్కడో కొంతమంది సినిమా స్లో అంటున్నారులే కానీ. అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే
భారీ బడ్జెట్ కాకపోయినా భారీ అంచనాల మధ్యన వచ్చిన సినిమా మిరాయ్. ప్రమోషనల్ కంటెంట్ ఎంత వైరల్ అయిందో.. ప్రీమియర్స్ మొదలు మొదటి రోజు షోస్ కంప్లీట్ అయ్యేవరకు వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే వైరల్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను కంప్లీట్ గా ఎంగేజింగ్ గానే ఉంచింది. ఎక్కడో కొంతమంది సినిమా స్లో అంటున్నారులే కానీ. అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే
Swetha
భారీ బడ్జెట్ కాకపోయినా భారీ అంచనాల మధ్యన వచ్చిన సినిమా మిరాయ్. ప్రమోషనల్ కంటెంట్ ఎంత వైరల్ అయిందో.. ప్రీమియర్స్ మొదలు మొదటి రోజు షోస్ కంప్లీట్ అయ్యేవరకు వచ్చిన రెస్పాన్స్ కూడా అంతే వైరల్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులను కంప్లీట్ గా ఎంగేజింగ్ గానే ఉంచింది. ఎక్కడో కొంతమంది సినిమా స్లో అంటున్నారులే కానీ. అది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఓ పాయింట్ ను తీసుకుని దాని చుట్టూ ఓ వరల్డ్ బిల్డ్ చేయాలంటే కాస్త సమయం తీసుకోవడం సహజం. వెంటనే సీన్ టు సీన్ ఫాస్ట్ ఫార్వార్డ్ మూమెంట్ లో వెళ్తే కథలో క్లారిటీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.
సో ఆ ఒక్క విషయంలో అక్కడక్కడ కాస్తంత ల్యాగ్ అనిపించొచ్చు. అది ఒక్కటి తప్ప సినిమా గురించి ప్రతి ఒక్కరినుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా పెట్టిన బడ్జెట్ కు ఇచ్చిన ఔట్పుట్ కు డైరెక్టర్ కు గుడి కట్టిన తప్పులేదని అంటున్నారంతా. ఎందుకంటే ఈ రేంజ్ బడ్జెట్ కు ఇంత క్వాలిటీ విఎఫ్ఎక్స్ , సిజి వర్క్స్ కంప్లీట్ అవ్వడం చాలా రేర్. గతంలో భారీ పెట్టుబడులు పెట్టి విఎఫ్ఎక్స్ లతో కుస్తీ పడి చివరికి ప్రేక్షకుల నుంచి ఇదెక్కడి గ్రాఫిక్స్ రా బాబు.. అని అనిపించుకున్న సినిమాలు లేకపోలేదు. వాటి అన్నిటికి మిరాయ్ ఇన్స్పిరేషన్ గా నిలిచింది.
ఇక అసలు విషయానికొస్తే సినిమాలో ప్రభాస్ వాయిస్. సోషల్ మీడియాలో కొంతమంది ఏకంగా సినిమాలో ప్రభాస్ ఏ రాముడు రూపంలో దర్శనం ఇచ్చాడంటూ ఫోటోలు పెట్టేస్తున్నారు. ఇప్పటికే సినిమా చూసిన వాళ్లకు ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. నిజానికి సినిమాలో ప్రభాస్ క్యామియో లేదు. కేవలం ప్రభాస్ ఓవర్ మాత్రమే ఉంది. అది కూడా ప్రభాస్ పర్మిషన్ తో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఇక సినిమాలో ఉన్న ఇంకొక సర్ప్రైజ్ ఏంటో చూసిన వాళ్లకు అర్ధమౌతుంది. చూడని వాళ్ళు వెంటనే థియేటర్స్ కు వెళ్లి చూడాల్సిందే. మొత్తానికి మిరాయ్ లో ప్రభాస్ క్యామియో మిస్టరీ వీడింది. ఇక మొదటి వీకెండ్ కంప్లీట్ అయితే కానీ కలెక్షన్స్ లెక్క తేలదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మిరాయ్ లో ‘వైబ్ ఉంది’ కానీ ఆ పాట లేదు