iDreamPost
android-app
ios-app

1970 – 2020 మన బ్యూరోక్రసి

  • Published Dec 12, 2020 | 7:54 AM Updated Updated Dec 12, 2020 | 7:54 AM
1970 – 2020 మన బ్యూరోక్రసి

ప్రజలకు బర్రెలు, గొర్రెలు ఇవ్వడం ఇప్పటిది కాదు. ఈ ఇందిరా గాంధీ 1970 దశకంలో మొదలు పెట్టింది. అయితే, ఈ పథకం అక్కడితో ఆపేస్తే కుదరదు. వాటికి మేత, ఆరోగ్యం విషయం చూడాలి. దీన్నే follow up అంటారు. ఈ follow up లేక అప్పట్లో ఈ పధకం ఆశించిన ఫలితాలు సాధించలేదు.

ఇప్పుడు మళ్ళీ ఈ పధకం రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. మూడేళ్ళ క్రితం పక్క రాష్ట్రంలో గొర్రెలు, మేకల పంపిణీ జరిగింది. ఇప్పుడు అది ఎలా ఉందో ఓసారి revisit చేసి review చేసుకోవాలి.

ఆరోగ్యానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో వెటర్నరీ అసిస్టెంట్ లను నియమించింది. అది ఓకే. మరి మేత సంగతి ఏంటి!?

గతంలోలాగా గ్రామాల్లో ఇప్పుడు పశువుల మేతకు ఉమ్మడి స్థలాలు లేవు. మేత ఏర్పాట్లు స్థానికంగా కల్పించకపోతే ఈ పధకం 1970ల నాటి లాగే విఫలం అవుతుంది.

ఇది 2020. మన పాలకులు 1970 నుండి upgrade అయ్యారా లేక అక్కడే ఆగిపోయారా అన్నదానిపై ఈ పధకం విజయం, విఫలం ఆధారపడి ఉంటుంది.

గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు, మందులు, విత్తనాలు సరఫరా చేసినట్టే, ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేసినట్టే, జనతా బజార్ల ద్వారా కూరగాయలు, grocery విక్రయానికి ఏర్పాట్లు చేస్తున్నట్టే, పశువుల మేత విక్రయ ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంది.

బర్రెలు, ఆవుల పాలసేకరణకు Amul తోనూ, గొర్రెలు, మేకల మాంసం సేకరణకు Allana Group తోనూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ విధంగానే బర్రెలు, గొర్రెలు, మేకల మేతకు సంబంధించిన సంస్థలతో ఒప్పందాలు కానీ, ఏర్పాట్లు కానీ జరిగినట్టు ఎక్కడా ప్రకటనలు ఇంతవరకూ రాలేదు. అంటే మన అధికారులు ఇంకా 1970 దశకంలోనే ఉన్నట్టున్నారు!

ప్రజలు update అయినా, పాలకులు update అయినా, బ్యూరోక్రసి update కాకపోతే స్వయం ఉపాధికి పునదులువేసే ఇటువంటి సంక్షేమ పథకాలు వృధా ఖర్చుగానే మిగిలిపోయాయి. సంక్షేమ పథకాలు social correction కు economic supplement కు ఉపయోగపడాలి. లేకపోతే ఇలాంటి ప్రయోగాలన్నీ మొత్తంగా exchequer పై భారంగా మారుతాయి. ధాన్యం కొట్లోకి ఎలుక దూరినట్టు, చెరువుకు గండి పడినట్టు నిష్ప్రయోజనం అవుతాయి.

మన బ్యూరోక్రసి 2020 వరకూ వస్తుందా? లేక 1970లోనే ఆగిపోతుందా!? చూద్దాం…