iDreamPost
android-app
ios-app

నాని సినిమాల వరస మారుతోందా

  • Published Dec 05, 2020 | 11:43 AM Updated Updated Dec 05, 2020 | 11:43 AM
నాని సినిమాల వరస మారుతోందా

న్యాచులర్ స్టార్ నాని చేయబోయే సినిమాల వరస మారుతోందా అంటే ఔననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీశ్’ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ శరవేగంగా సాగుతోంది. థియేటర్లకు వంద శాతం ఆక్యుపెన్సీ అనుమతులు రాగానే మార్చ్ లేదా ఏప్రిల్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత నాని రెండు క్లియర్ కమిట్ మెంట్స్ ఇచ్చాడు. ఒకటి ‘శ్యామ్ సింగ రాయ్’. రెండోది ‘అంటే సుందరానికి’. తాజా అప్ డేట్ ప్రకారం ఇప్పుడీ సిరీస్ మారొచ్చని ఇన్ సైడ్ టాక్. అంటే సుందరానికి ముందు పూర్తి చేసి ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్ స్టార్ట్ చేసే ఆలోచన జరుగుతొందట

ఈ మార్పు ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయని వినికిడి. శ్యామ్ సింగ రాయ్ భారీ బడ్జెట్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే నిర్మాత చేంజ్ అయ్యాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సుమారు 40 కోట్లకు పైగా బడ్జెట్ అవసరమవుతోందని అంటున్నారు. అదే నిజమైతే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో అంత బిజినెస్ నాని సినిమా చేయలేదు. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే నలభై మార్క్ చేరుకోవచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా యావరేజ్ అన్నా అంతా తలకిందులవుతుంది. పైగా డిస్ట్రిబ్యూటర్లు ఇంతకు ముందులా అడిగినంత రేట్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. మీడియం రేంజ్ హీరోలకు కనీసం ఇరవై శాతం దాకా తగ్గించి కొంటున్నారు.

అలాంటప్పుడు శ్యామ్ సింగ రాయ్ ని ఇప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తే రిస్క్ అని భావించి హోల్డ్ లో పెట్టబోతున్నట్టు తెలిసింది. అంటే సుందరానికి బడ్జెట్ పరంగా ఎలాంటి రిస్క్ లేదు. వివేక్ ఆత్రేయ తక్కువ ఖర్చుతోనే క్వాలిటీ ఇవ్వగలడు. అందులోనూ ఇది ఎంటర్ టైనింగ్ సబ్జెక్టు కాబట్టి లొకేషన్స్ పరంగానూ ఇబ్బందులు ఉండవు. అయితే శ్యామ్ సింగ రాయ్ అధిక భాగం కోల్కతాలోనే షూట్ చేయాలి. కానీ అదంత ఈజీ కాదు. పోనీ ఇక్కడే సెట్లు వేద్దామా అంటే నాని రేంజ్ దాటిపోతుంది. అందుకే అంటే సుందరం రిలీజయ్యాక అప్పుడు ప్లాన్ చేయాలని చూస్తున్నారట. దీనికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు.