iDreamPost
iDreamPost
మన్మథుడు 2 తర్వాత టీవీలో తప్ప బిగ్ స్క్రీన్ మీద మిస్ అవుతున్న కింగ్ అక్కినేని నాగార్జున కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా వైల్డ్ డాగ్. గత ఏడాదే నిర్మాణం పూర్తయినప్పటికీ వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా వేస్తూ వచ్చి, ఒకదశలో ఓటిటి అనుకుని మళ్ళీ థియేట్రికల్ వైపే మొగ్గు చూపి ఫైనల్ గా వెండితెరపైనే వినోదాన్ని అందించనున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మసాలా ఫార్ములా లేకుండా నాగ్ చేస్తున్న మూవీగా వైల్డ్ డాగ్ మీద ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. అందులోనూ కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇందాకా దీని ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ద్వారా రిలీజ్ చేశారు.
హైదరాబాద్ లో జరిగిన గోకుల్ ఛాట్ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకునేందుకు ప్రభుత్వం ఎన్ఐఏ టీమ్ సహాయం కోరుతుంది. దాని హెడ్ గా వ్యవహరించే విజయ్ వర్మ(నాగార్జున)కు టెర్రటిస్టుల పట్ల ఎలాంటి జాలి దయా ఉండవు. వాళ్ళు లొంగిపోతామన్నా సరే అక్కడిక్కడే కాల్చేసి చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుస్తాడు. అయితే ఇలాంటి ముఠాలను నడిపిస్తున్న వాడు వేరే ఉన్నాడని తెలుసుకున్న విజయ్ వర్మ తన టీమ్ తో కలిసి ప్రాణాలకు తెగించి మరీ సాహసానికి పూనుకుంటాడు. ఈ క్రమంలో ప్రమాదాలు ఎదురవుతాయి. అవన్నీ తెరమీద ఏప్రిల్ 2 న చూడాల్సిందే.
చాలా కాలం తర్వాత నాగార్జున కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కనిపించడమే కాదు చాలా స్టైలిష్ గా ఉన్నారు. దియా మీర్జా భార్యగా నటించగా సయామీ ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. విజువల్స్ చాలా బాగా వచ్చాయి. బాలీవుడ్ ను తలదన్నే రేంజ్ లో దర్శకుడు అహిషోర్ సాల్మోన్ వైల్డ్ డాగ్ ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. తమన్ మరోసారి తన పనితనాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రూపంలో చూపించాడు.ఇప్పటిదాకా పెద్దగా అంచనాలు లేని వైల్డ్ డాగ్ ని ఒక్కసారిగా ఈ ట్రైలర్ హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. సో ఏప్రిల్ 2న కింగ్ ఫ్యాన్స్ కి యాక్షన్ ఫీస్ట్ గట్టిగానే వచ్చేలా ఉంది.
Trailer Link @ http://bit.ly/38u7wNx