iDreamPost
android-app
ios-app

వైల్డ్ డాగ్ కూల్ ఐడియా

  • Published Sep 03, 2020 | 11:14 AM Updated Updated Sep 03, 2020 | 11:14 AM
వైల్డ్ డాగ్ కూల్ ఐడియా

ఇందాక నాగార్జున నటిస్తోన్న వైల్డ్ డాగ్ టీమ్ ఒక వీడియో రిలీజ్ చేసింది. షూటింగ్ స్పాట్ లో తీసుకుంటున్న జాగ్రత్తలు, శానిటైజేషన్, యూనిట్ సభ్యుల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతోంది లాంటివన్నీ ఇందులో పొందుపరిచారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మాములు మేకింగ్ వీడియోనే. అయతే ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో విడుదల చేయడంతో ఇది అందరి అటెన్షన్ తీసుకుంటోంది. ఒకరకంగా ఇది మంచి ఐడియా అని చెప్పాలి. స్టార్ హీరోలు కరోనాకు భయపడి సెట్ కు రావడం లేదు. ఇందులో న్యాయం ఉంది. అయితే ఇలా ఎన్నాళ్ళని ఇంట్లోనే ఉంటే జరిగే నష్టం కూడా చిన్నది కాదు. కేసులు నమోదవుతూనే ఉన్నా అలెర్ట్ గా ఉంటూ వైద్యులు చెప్పిన కేర్ తీసుకుంటే వైరస్ ఎటాక్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.

అందులోనూ నాగార్జున లాంటి ఫిట్నెస్ ఫ్రీక్ స్వయంగా రంగంలోకి దిగాడంటే అంతకన్నా ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు. ఇప్పటికే ఆరు నెలలకు పైగా షూటింగులు ఆగిపోయి పెద్ద హీరోల సినిమా యూనిట్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నిర్మాతలు జీతాలు ఇస్తుండగా మరికొందరు రీ స్టార్ట్ అయ్యాకే అని చెప్పి పంపించారు. సో వైల్డ్ డాగ్ తరహాలో పక్కా ప్లానింగ్ తో మిగిలినవాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ నెలతో పాటు అక్టోబర్ నుంచి స్టూడియోలో అవుట్ డోర్స్ లో సందడి పెరిగే ఛాన్స్ ఉంది. అయితే అక్కడక్కడా కరోనా కేసులు బయటపడుతుండటం కూడా ఆందోళన పెంచుతోంది.

తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా యూనిట్ లో ఒకరికి వైరస్ పాజిటివ్ రావడంతో షూట్ ఆపేశారని టాక్ వచ్చింది. ఇలాంటివి క్రమం తప్పకుండ నమోదవుతూనే ఉన్నాయి. అందుకే వైల్డ్ డాగ్ ది ఒకరకంగా డేరింగ్ అండ్ కూల్ ఐడియా అని చెప్పొచ్చు. వీడియో చివర్లో కమింగ్ సూన్ అని ఇచ్చారు కాబట్టి ఓటిటిలో వచ్చే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్న వైల్డ్ డాగ్ లో హీరోయిన్ కానీ పాటలు కానీ లేవు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ మీద కింగ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే రిలీజ్ కావొచ్చు. దీంతో పాటు మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ 4 సెట్లోకి కూడా నాగ్ అడుగుపెట్టనున్నాడు

Link Here @ bit.ly/2GrivMM