iDreamPost
iDreamPost
రెండు రోజుల క్రితం శివరాత్రి సందర్భంగా విడుదలైన జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద చేస్తున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. ఉప్పెన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో క్రౌడ్స్ థియేటర్ల వద్ద దీనికే కనిపిస్తున్నాయని ఇప్పటికే ట్రేడ్ రిపోర్ట్స్ ప్లస్ కలెక్షన్స్ ని బట్టి అర్థమవుతోంది. ఈ వీకెండ్ మొత్తం తన కంట్రోల్ లోకే వెళ్లబోతోంది. పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ శ్రీకారం ఈ స్థాయిలో స్పీడ్ చూపించలేకపోవడంతో ఎక్కువ స్క్రీన్లు అధిక టికెట్ ధరలు లాంటి అడ్వాంటేజ్ ఉన్నా కూడా రెండో స్థానంలోనే సరిపుచ్చుకుంటోంది. చాలా చోట్ల గాలి సంపత్, రాబర్ట్ లకు వచ్చిన డిజాస్టర్ రిపోర్టులకు వాటి స్క్రీన్లు పై రెండు సినిమాలకు వెళ్ళిపోతున్నాయని ఇన్ సైడ్ టాక్
ఇదిలా ఉండగా జాతరత్నాలులో చిన్న క్యామియోలు విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యపరిసింది. విజయ్ జస్ట్ అలా కనిపించి మాయమవుతాడు కానీ కీర్తికు ఓ మూడు షాట్లు రెండు డైలాగులు పడ్డాయి. ఇది ప్రమోషన్ లో ఎక్కడా రివీల్ చేయలేదు. అంత చిన్న పాత్రల్లో వీళ్ళు నటించడం నిజంగా షాకే. అయితే దీని వెనుక కారణాలు ఉన్నాయి. కీర్తి సురేష్ కి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇచ్చిన మహానటి సినిమా నిర్మాత స్వప్న సినిమా, దర్శకుడు నాగ అశ్విన్ ఇద్దరితోనూ తనకు పర్సనల్ బాండింగ్ ఉంది. అందుకే జాతిరత్నాలు స్క్రిప్ట్ దశలోనే తనతో ఈ రోల్ చేయించాలని ముందే చెప్పేసి మాట తీసుకున్నారట.
ఇక విజయ్ దేవరకొండలో అసలు నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్ నాగఅశ్విన్ ఇప్పటి జాతరత్నాలు ప్రొడ్యూసర్. అప్పటి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ కారణంగానే మహానటిలోనూ విజయ్ మొహమాటపడకుండా చాలా చిన్న క్యారెక్టర్ చేశాడు. ఇదంతా ఫ్రెండ్ షిప్ లో భాగంగా జరిగిందే. ఇప్పుడు జాతిరత్నాలుకు ఈ రెండు క్యారెక్టర్స్ పెద్దగా ప్లస్ కాకపోయినా స్వీట్ గిఫ్ట్స్ గా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జాతిరత్నాలు రన్ చూస్తుంటే థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న పదకొండు కోట్లను రెండో వారం అడుగుపెట్టే లోగా రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది