iDreamPost
android-app
ios-app

ఒంటరి కష్టాలు: రేవంత్ కు కోరస్ ఎక్కడ…?

  • Published Sep 13, 2021 | 8:04 AM Updated Updated Sep 13, 2021 | 8:04 AM
ఒంటరి కష్టాలు: రేవంత్ కు కోరస్ ఎక్కడ…?

కష్టాల కడలిలో ఆటు పోట్లు ఎదుర్కొంటూ ఏడేళ్ళ నుంచి వెనక్కు పోతున్న తెలంగాణా కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టి తీరానికి చేర్చడానికి అత్యంత నమ్మకంగా ఎంపీ రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. నీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకో రిజల్ట్ చూపించు అని చెప్పేసి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు రాహుల్. హర్ట్ అయిన వాళ్ళను పట్టించుకుని టైం వేస్ట్ చేయకుండా కార్యకర్తలను దారిలోకి తెచ్చి ప్రజలను ఆకట్టుకుని జెండా ఎగురవేయమని చెప్పింది జాతీయ నాయకత్వం. అన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకోమంది.

అంత అవకాశం వచ్చాక రేవంత్ ఆగుతారా…?

ప్రభుత్వం మీద కత్తి కట్టి పందెం పుంజు మాదిరి సభలు, సమావేశాలు, సమీక్షలు చేయడం మొదలుపెట్టారు. హుజూరాబాద్ అభ్యర్ధి దొరకకపోవడం తో ముగ్గురు నేతలకు ఆయన బాధ్యతలు ఇచ్చారు… దళిత ఓట్లను దళిత బంధు పేరుతో అధికార పార్టీ లాగే అవకాశం పుష్కలంగా ఉన్న నేపధ్యంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రభుత్వ అవినీతిని లక్ష్యంగా చేసుకుని విమర్శల బాణాలను గట్టిగా గురి పెట్టి ఇబ్బంది పెడుతున్నారు.

ఈ తరుణంలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చి రేవంత్ కు సవాల్ విసిరి… నిరుద్యోగులను, దళితులను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంటే… దళితుల ఇళ్ళకు వెళ్లి అన్నం తిని, టిఫిన్ చేసి నిద్ర చేయడం మొదలుపెట్టి… కొసరుగా కుర్చీలో పేపర్ చదివి ఫోటోలు విడుదల చేసారు. సరే గాని ఇప్పుడు అసలు విషయానికి వస్తే… రేవంత్ రెడ్డి మల్లారెడ్డి సహా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేసారు. ఈటెల రాజేంద్ర విషయంలో రామాలయం భూములకు సంబంధించి ప్రభుత్వం ఆరోపణలు చేస్తే అధికార పార్టీ అధికారిక పత్రిక కార్యాలయం ఎక్కడ ఉందో చెప్పారు.

Also Read : తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

సర్వే నెంబర్ లు విడుదల చేసి… ఈటెలకు సపోర్ట్ చేసి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఇలా ఏదోక రకంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మంత్రి మల్లారెడ్డి విషయంలో ఆయన చేసిన ఆరోపణలు ఒక సంచలనం. మంత్రి కేటిఆర్ కూడా స్పందించే పరిస్థితి రావడం మల్లారెడ్డి తోడకోట్టడం కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్లకు కోరస్ అందుకునే నాయకత్వం కనపడటం లేదు. రేవంత్ పీసీసీ చీఫ్ కాక ముందు మంత్రి తలసానితో కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను చూసి… నల్గొండ లాకప్ డెత్ విషయంలో గట్టిగా ఆరోపణలు చేసి… ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన మల్లు భట్టి విక్రమార్క సైలెంట్ అయిపోయారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ మీడియాకు దొరకడం లేదు, ఉత్తమ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు, హనుమంతన్న జాడ లేదు, సొంత జిల్లా నేతల పలకరింపులు లేవు… కౌశిక్ రెడ్డి తిట్టిన తిట్లకు సమాధానం చెప్పే నాయకత్వమూ లేకపోయే. సీతక్క, మల్లు రవి, కోదండ రెడ్డి వాళ్ళే కనపడుతున్నారు గాని అసలు నాయకత్వం కనుమరుగు అయిపొయింది. ధర్మపురి సంజయ్ లాంటి వాళ్ళు పార్టీ మారి సపోర్ట్ చేయడమే గాని పార్టీలో ఉన్న ఎవరూ మాట్లాడటం లేదు.

రేవంత్ కు పీసీసీ బాధ్యతలు ఇస్తే ఇతర పార్టీల వాళ్ళు వస్తారని చూసినా వాళ్ళు రాకపోయే. మల్లారెడ్డి విషయంలో, ఈటెల విషయంలో డిబేట్ లు పెట్టి రేవంత్ మాట్లాడటమే గాని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడి నుంచి సపోర్ట్ లేదు. సొంత ఇమేజ్ కి యూట్యూబ్ లో వ్యూస్ వస్తున్నాయి, ఫేస్బుక్ లో లైక్ లు వస్తున్నాయి గాని నీకు నేనున్నా తమ్ముడు అని భుజం మీద చెయ్యేసి నడిపించే సీనియర్ నాయకులు కనపడటం లేదు. దానికి తోడు హుజూరాబాద్ లో పోటీ చేయక్కా అంటే నేను చేయను అంటూ కొండా సురేఖ చెప్పడం అదనపు తలనొప్పి. మరి రేవంతు ఏం చేస్తారో ఆ పార్టీ ఎలా గాడిలో పడుతుందో చూడాలి.

Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?