iDreamPost
iDreamPost
బాలీవుడ్ డైరెక్ట్ ఓటిటి రిలీజుల్లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా ఉన్న అక్షయ్ కుమార్ లక్స్మీ బాంబ్ విడుదల తేదీ ఇప్పటిదాకా ఖరారు చేయలేదు. హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న రావొచ్చని ఊహాగానాలు వచ్చాయి కానీ అలాంటి సూచనలేవి ఇప్పటిదాకా లేవు. తాజాగా దీనికి డేట్ లాక్ చేశారని ముంబై అప్ డేట్. దాని ప్రకారం నవంబర్ 13న దీపావళి పండగ సందర్భంగా లక్స్మీ బాంబ్ ని చిన్నితెరలపై తీసుకొస్తున్నారు. అయితే ఇంత ఆలస్యం ఎందుకన్న అనుమానం రావడం సహజం. దానికి కారణాలు లేకపోలేదు. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత నెపోటిజం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది.
దాని ప్రభావం సడక్ 2 మీద చాలా దారుణంగా పడింది. ఆ సినిమా బాలేదన్న మాట వాస్తవమే కానీ అసలు స్ట్రీమింగ్ జరగడానికి ముందే దాన్ని టార్గెట్ చేసిన మాటా నిజమే. అయితే అక్షయ్ కుమార్ కు ఈ ఇష్యూ కి సంబంధం లేకపోయినప్పటికీ సుశాంత్ కు రావాల్సిన కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ అక్షయ్ తనక్లు వచ్చేలా చేసుకున్నాడన్న ఆరోపణలు కొందరు అభిమానులు చేశారు. దానివల్లే అతని కెరీర్ ప్రభావితం చెందిందన్నది వాళ్ళ వాదన. ఇది నిజమో అబద్దమో కానీ ప్రచారమైతే జోరుగా సాగింది.
దానికి తోడు సుశాంత్ కేసు విచారణ మంచి కాక మీద ఉంది. ఇప్పుడు విడుదల పెట్టుకుంటే రెస్పాన్స్ విషయంలో ఏమైనా తేడాలు రావొచ్చు. అయితే అసలు రీజెన్ మరొకటి కూడా ఉందట. లక్స్మీ బాంబ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకొంచెం బాలన్స్ ఉందట.
ప్రస్తుతం బెల్ బాటమ్ షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న అక్షయ్ కుమార్ రాగానే అది పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తారు. ఎలాగూ దీపావళి పండగ టైంకంతా కరోనా బెడద ఓ కొలిక్కి వచ్చి ఉంటుంది. జనం సాధారణ మూడ్ లో ఉంటారు కాబట్టి అప్పుడు విడుదల చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. సుశాంత్ సింపతీ మీద బ్రహ్మాండమైన వ్యూస్ తెచ్చుకున్న దిల్ బేచారా తర్వాత హాట్ స్టార్ లో విడుదలైన లూట్ కేస్, ఖుదా హఫీజ్, సడక్ 2 మరీ అద్భుతాలు చేయలేకపోయాయి. అందుకే రాబోయే భుజ్, బిగ్ బుల్, లక్స్మీ బాంబ్ మీదే ఈ సంస్థ చాలా ఆశలు పెట్టుకుంది. కేవలం అక్షయ్ ని నమ్ముకుని హక్కుల కోసం నూటా పాతిక కోట్ల పెట్టుబడిని పెట్టినప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కాంచన రీమేక్ గా లారెన్స్ దర్శకత్వంలోనే రూపొందిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించడం ప్రధాన ఆకర్షణ