iDreamPost
android-app
ios-app

అలా అనేస్తే ఎలా అనసూయా.?

అలా అనేస్తే ఎలా అనసూయా.?

‘బుల్లితెరపై నన్నంతా గ్లామరస్‌ యాంకర్‌గానే చూస్తున్నారు. నా గ్లామర్‌కి బుల్లితెర వీక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే, వెండితెరపై పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రల్నే ఎంచుకుంటున్నా..’ అని పలు ఇంటర్వ్యూల్లో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన అనసూయ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంకోసారి ఇదే విషయాన్ని కుండబద్దలుగొట్టేసింది. అయితే, అనసూయని వెండితెరపై గ్లామరస్‌ రోల్స్‌లో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. పెర్ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌ ఎంచుకోవడమంటే, అందులో గ్లామర్‌ మిక్స్‌ అయినా అవ్వొచ్చునట. సో, అనసూయని ముందు ముందు మనం గ్లామరస్‌ రోల్స్‌లో కూడా చూడబోతున్నామన్నమాట. అయినా, అందులో తప్పేముంది.? పైగా, నిండైన విగ్రహం. అనసూయ వెండితెరపై గ్లామరస్‌గా కన్పిస్తే.. ఆ కిక్కే వేరప్పా. అన్నట్టు, బుల్లితెరకా.? వెండితెరకా.? దేనికి ఫస్ట్‌ ప్రిఫరెన్స్‌.? అని ప్రశ్నిస్తే మాత్రం ‘బుల్లితెర’ అని ఖరాఖండీగా చెప్పేసింది. ఇది అభిమానుల్ని ఒకింత నిరుత్సాహపరిచింది. నిజానికి, అనసూయకి టాలీవుడ్‌ నుంచి ఆఫర్స్‌ బాగానే వస్తున్నాయి. కానీ, అనసూయ మాత్రం చాలా సెలక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. దానికి బలమైన కారణం లేకపోలేదు. వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటే, బుల్లితెరకు కాస్త గ్యాప్‌ ఇవ్వాల్సి వస్తుంది. ఆ గ్యాప్‌ వస్తే, ఆ తర్వాత మళ్ళీ బుల్లితెర వీక్షకులు తనను మర్చిపోతారేమోనన్న ఆందోళన బహుశా అనసూయలో గట్టిగానే వుందేమో. ప్రస్తుతం రెండు మూడు పెద్ద సినిమాల్లో అనసూయ ఇంట్రెస్టింగ్‌ రోల్స్‌లో కన్పించేందుకు సిద్ధమవుతోంది.