iDreamPost
iDreamPost
కొండపల్లి నగర పాలక సంస్థ కీలకంగా మారింది. తుది ఫలితాల్లో ఎవరికీ ఆధిక్యం దక్కకపోవడం దానికి కారణం. అటు వైఎస్సార్సీపీ, ఇటు టీడీపీ కూడా చెరో 14 వార్డులతో సరిపెట్టుకున్నాయి. మొత్తం 29 వార్డులున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 15 కాగా మరో సీటు ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె టీడీపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు సమక్షంలో కౌన్సిలర్ శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు. దాంతో ఆపార్టీ బలం 15కి చేరింది. దాంతో పాటుగా ఎంపీగా ఉన్న కేశినేని నాని కూడా తన ఎక్స్ అఫీషియో ఓటుని కొండపల్లిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. దాంతో ఆపార్టీ బలం 16 అవుతుంది.
ఇక వైఎస్సార్సీపీ కి 14 మంది కౌన్సిలర్లుండగా, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఓటుతో కలిపి ఆపార్టీ బలం 15గా ఉంటుంది. అదే సమయంలో టీచర్ ఎమ్మెల్సీగా గెలిచి, వైఎస్సార్సీపీకి మద్ధతురాలిగా ఉన్న కల్పలతా రెడ్డి ఓటు కూడా కీలకంగా భావిస్తున్నారు. ఆమె కు ఓటు హక్కు లభిస్తే ఇరు పార్టీల బలం సమానమవుతుంది. దానికి రాజ్యాంగపరంగా ఉన్న నిబంధనలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
అదేసమయంలో ఇరు పార్టీలలోనూ కౌన్సిలర్లు చేజారిపోకుండా జాగ్రత్త పడేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ తన కౌన్సిలర్లను క్యాంపుకి తరలించే ఏర్పాట్లలో ఉంది. అయితే అధికార పార్టీ వైపు కొందరు తరలిపోతారనే ఆందోళనతో ముందస్తుగా పలు జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ చివరి నిమిషంలో పరిణామాలు ఎటువైపు దారి తీసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. దాంతో ఇక్కడ పీఠం ఎక్కేదెవరన్నది చివరి వరకూ సస్ఫెన్ష్ గానే భావించాలి. కానీ ప్రస్తుతానికి టీడీపీలో కొంత ధీమా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని ఇక్కడ కీలకంగా వ్యవహరించాలి. దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానమే అయినప్పటికీ ఎంపీ అంతా తానై వ్యవహరించారు. ఉమా మీద వ్యతిరేకత ఉన్న వారిని కూడా చేరదీసి ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయించే ప్రయత్నంలో కొంత ఫలితం సాధించారు. ఇక చైర్మన్ పీఠం విషయంలో తుది అంకం మాత్రం ఆసక్తికరమే.
Also Read : Kuppam Municipality Results – చంద్రబాబు కంచుకోటను బద్ధలుకొట్టిన వైసీపీ