iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్ లో ఓ కథనం వచ్చింది. దాని ప్రకారం మత మార్పిడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దానిని తీసుకుని చిలువలు పలవలుగా కథలు అల్లేసి పచ్చ మీడియా బురద జల్లే ప్రయత్నం చేసింది. జగన్ ని బద్నాం చేసేందుకు ఆర్గనైజర్ ని అడ్డుపెట్టుకునే యత్నం జరిగింది. కానీ తీరా చూస్తే ఆర్గనైజర్ కథనం వెనుక అసలు ఆర్గనైజర్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పటికే అన్ని చోట్లా తన మనుషులతో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడిగా ఉన్న చంద్రబాబుదే ఈ క్రెడిట్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో కూడా ఇదే పద్ధతి అవలంభించేవారు. తమకు గిట్టని వారు అధికారంలో ఉన్న సమయంలో వివిధ పత్రికల్లో కథనాలు రాయించడం, దానిని పచ్చ మీడియా అందిపుచ్చుకుని గగ్గోలు పెట్టడం ఓ ఆనవాయితీ అనేది కొందరికే తెలిసిన సత్యం. కానీ ఇటీవల అది మీడియా విస్తరణతో బట్టబయలు అవుతోంది. తాజా ఎపిసోడ్ లో కూడా అదే జరిగింది. నిజానికి ఆర్గనైజర్ లో వచ్చిన కథనం వారి సొంతం కాదని తేలిపోయింది.సహజంగా ఆర్ఎస్ఎస్ కి చెందిన వారి వ్యాసాలు అందులో వస్తాయి. కొన్నిసార్లు ఇతర బ్లాగులు, అనేక మంది వ్యాసకర్తల నుంచి కూడా తీసుకుంటారు.
Also Read : ఉద్యోగాంధ్రప్రదేశ్ : ఏపీ వినూత్న నిర్ణయాలు
ఏపీ ప్రభుత్వం మీద ప్రచురించిన కథనం కూడా సత్య దోసపాటి అనే ఎన్ ఆర్ ఐ రాసిన కథనం. ఆయన గతంలో చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగిన వారు.సత్య బ్లాగ్ నిర్వహిస్తున్న ఆయన పోస్ట్ ని మతం కోణంలో ఆర్ఎస్ఎస్ తీసుకుని ఆర్గనైజర్ లో ప్రచురించింది. అలా ఆపోస్ట్ తీసుకునేలా కూడా తెరవెనుక కథ నడిపినట్టు కనిపిస్తోంది. కొంతకాలంగా జగన్ పై తీవ్ర ద్వేషాన్ని ప్రదర్శించే సత్య దోసపాటి తాజా వ్యాసంలో కూడా అదే ప్రదర్శించారు. ఏపీలో తమ వర్గీయుడు ముఖ్యమంత్రి పదవిని కోల్పోగానే సుదూర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా రంగంలో దిగి ఇలాంటి కథ నడుపుతున్నట్టు కనిపిస్తోంది. వారి రాతల్లో విషాన్ని కొన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చేలా చేయడానికి ఓ యంత్రాంగం ఉందనే వాదన కూడా ఉంది.
గతంలో అమరావతిపై శేఖర్ గుప్తా వ్యాసాన్ని ఈనాడు పత్రికలో ప్రచురించి పెద్ద హడావిడి చేశారు. ఈసారి ఆర్గనైజర్ ని మతం పేరుతో ముడిపెట్టి ముందుకు తీసుకొచ్చారు. ఇలా వివిధ రూపాల్లో ప్రయత్నాల ద్వారా జగన్ ని బద్నాం చేయాలనే దుర్బుధ్ధి తప్ప మరోటి లేదని స్పష్టమవుతోంది. అమెరికాలో కూర్చుని ఆంధ్రాలో ఏదో జరుగుతోందని రాసే రాతల్లో ఎంత వాస్తవముందే అందరికీ తెలుసు. అయినా పదే పదే జగన్ మీద ముద్రలు వేసి మందిని మరోసారి మోసం చేయగలమనే యత్నంలో ఈ వర్గం ఉన్నట్టు తాజా అనుభవం చాటుతోంది.
Also Read : ముఖ్యమంత్రులకు ఢిల్లీ హైకోర్టు షాక్!