“పిలవకపోయినా వస్తా” -ఇది సర్దార్ గబ్బర్ సింగ్‌లో పవన్‌కళ్యాణ్ డైలాగ్. రాష్ట్రమంతా కరోనా విపత్తులో వున్నపుడు మరి పవన్ ఏం చేస్తున్నాడు? పత్రికా ప్రకటనలు ఇస్తున్నాడు.
పవన్ తనని తాను రాజకీయ నాయకుడి కంటే ప్రజానాయకుడని భావిస్తారు. మరి లక్షలాది మంది తిండికి లేక కష్టాల్లో వుంటే పవన్ ఏం చేశాడు. విరాళం ఇచ్చి వూరుకున్నాడు.
గెలవలేకపోయినా, ప్రతి వూళ్లో పవన్ అభిమానులు, లేదా జనసేన కార్యకర్తలున్నారు. దారిలో చిక్కుకుపోయిన వాళ్లకీ, మురికివాడల్లో భోజనం లేక బాధపడుతున్న వాళ్లకీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, కొన్ని చోట్ల వైఎస్ఆర్‌సీపీ నాయకులు సాయం చేస్తున్నారు. పవన్ చెబితే జనసైనికులు కూడా ఆ పని చేస్తారు. అది చేయకుండా జగన్‌ని విమర్శించే పనిలో పవన్, చంద్రబాబు వున్నారు.
జగన్ పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. సకాలంలో పింఛన్లు అందించాడు. రేషన్ పంపించాడు. వెయ్యి రూపాయలు డబ్బు అందిస్తున్నాడు. రాష్ట్రంలో కరోనా అదుపు తప్పి పోకుండా కట్టడి చేస్తున్నాడు.
ఒకవైపు అమెరికా అధ్యక్షుడే చేతులెత్తేసి లక్ష మంది చచ్చిపోతారని అంటున్నాడు. జగన్ నిరంతరం ధైర్యం చెబుతున్నాడు. సకాలంలో చికిత్స చేయించుకుంటే కరోనాతో ముప్పు లేదని పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడు.
కష్టకాలంలో కలిసి పోరాడాల్సిన చంద్రబాబు ఇంట్లో కూచుని జగన్ పాలనపై రంధ్రాన్వేషణ చేస్తున్నాడు. పవన్ పత్రికా ప్రకటనలు ఇస్తున్నాడు. జనం అంతా చూస్తున్నారు, వింటున్నారు.