iDreamPost
android-app
ios-app

ఏమి చెయ్యాలి?

  • Published Oct 24, 2019 | 9:48 AM Updated Updated Oct 24, 2019 | 9:48 AM
ఏమి చెయ్యాలి?

ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అన్ని చేసేశాం అనుకుంటే అసలు సమస్యే కనపడదు. గత ప్రభుత్వ ధోరణికి భిన్నంగా నీటి సమస్య పరిష్కారానికి ఏమి చెయ్యాలి అని ఈ ప్రభుత్వం ఆలోచించటం అభినందనీయం.

2017 నుంచి ప్రతిసంవత్సరం రాయలసీమకు 100 టీఎంసీలు 120 టీఎంసీలు నీళ్లు ఇచ్చామన్న ప్రకటనలలో డొల్లతనం ఇప్పుడు కళ్ళముందు స్పష్టంగా కనిస్పిస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్,పులిచింతల,ప్రకాశం బ్యారేజి దాదాపు నెల కిందటే నిండిన ఇప్పటికి సీమ ప్రాజెక్టులు 50% నిండలేదు… కాలువల సామర్ధ్యం పెంచకుండ నీళ్లు ఎలా ఇస్తారు?నీళ్లు ఎలా పారుతాయి?

గత నెల నుంచి నేను రాస్తుంది ఈ విషయాన్నే. పోతిరెడ్డి పాడు నుంచి బానకచెర్లకు 44,000 క్యూసెక్కులు పారిస్తే కాలువ పక్కన ఉన్న పొలాలు మునిగిపోతున్నాయి. వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్కు కనీసం 3000 క్యూసెక్కులు పారటం లేదు.

దాదాపు 25 రోజుల తరువాత కూడా 17. 74 టీఎంసీ ల సామర్ధ్యమున్న బ్రహ్మం సాగర్ లో కేవలం 2.62 టీఎంసీ లు మాత్రమే నీళ్లు ఉన్నాయి. బ్రహ్మ సాగర్ కు ముందు ఉన్న SR1 2.13 టీఎంసీ ల నిలువ సామర్ధ్యం )లో 1.34 టీఎంసీ లు,SR 2 (2. 44 టీఎంసీ ల నిలువ సామర్ధ్యం )లో 1.38 టీఎంసీ లు మాత్రమేవున్నాయి.


పోతిరెడ్డి పాడు నుంచి తోడిన నీళ్లలో సగానికి పైగా నిప్పుల వాగు ఎస్కేప్ ఛానల్ ద్వారా కుందు – పెన్నా నుంచి సోమశిల అక్కడి నుంచి కండలేరు చేరుతున్నాయి. 78 టీఎంసీల నిలువ సామర్ధ్యం సోమశిలలో 33.48 టీఎంసీలు,68 టీఎంసీల నిలువ సామర్ధ్యం ఉన్న కండ్లేరులో 5. 12 టీఎంసీల నీరు ఉన్నది.

SRBC & గాలేరు-నగరి & కింద గోరకల్లులో 8 టీఎంసీ (కెపాసిటీ 12.44 టీఎంసీ ),అవుకు 3.15 (కెపాసిటీ 4.15 టీఎంసీ ),గండికోట 11.68(కెపాసిటీ 26.85 టీఎంసీ) నీళ్లు ఉండగా మరో వైపు హంద్రీ-నీవా కింద జీడిపల్లిలో 0.62టీఎంసీ(కెపాసిటీ 1.69 టీఎంసీ ) , గొల్లపల్లి లో 0.68 టీఎంసీ లు(కెపాసిటీ 1.91 టీఎంసీ ) లు మాత్రమే ఉన్నాయి.

దాదాపు 20 రోజుల(కొన్ని వరద లేని రోజులను వదిలేస్తే ) వరద తరువాత కూడా ఈప్రాజెక్టు పూర్తిగా నిండలేదు. మూల కారణం కాలువల సామర్ధ్యం తక్కువగా ఉండటమే .

జగన్ గారు నిన్న జరిపిన సమీక్షలో ఈ సమస్యను అడ్రస్ చేశారు. 120 రోజులు వరద వస్తుందన్న అంచనాను తగ్గించి 30 నుంచి 40 రోజులు మాత్రమే వరద వస్తుందన్న అంచనాతో కృష్ణ నది వరద మీద ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపటానికి పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 44,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచి ,ప్రాజెక్టులకు నీళ్లు తీసుకెళ్లే అన్ని కాలువల సామర్ధ్యాన్ని పెంచమని ఆదేశించారు. వెలుగోడు నుంచి కడప జిల్లాలోని బ్రహ్మం సాగర్ కాలువ లైనింగ్ సమస్యను కూడా గుర్తించారు.

ఇదే సందర్భంలో దీర్ఘ కాలంగా డిమాండ్ ఉన్న తుంగభద్ర మీద గుండ్రేవుల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు.ఈ గుండ్రేవుల గురించి డిజైన్ తో సహా అనేక విజ్ఞాపనలు చేసి సొంత డబ్బులతో కరపత్రాలు వేసి అటు తెలంగాణ పరిధిలోని పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఇటు కర్నూల్ జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేసిన సుబ్బారాయుడు సార్ కు, ఆయనకు మద్దతుగా నిలిచినా పాణ్యం సుబ్రహ్మణ్యం సార్,KrishnaReddy Kanapuram సార్ తదితరులకు అభినందనలు. Sir,మీరు మీ స్థానిక MP, MLAల మీద ఒత్తిడిని పెంచి పనులు తొరగా మొదలయ్యేలా చూడండి సార్.

కుందు నది మీద జోలదరాశి మరియు రాజోలి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. జోలదరాశి ప్రాజెక్ట్ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న Kamani Vgreddy అన్నకు అభినందనలు.

పల్నాడుకు ఉపయోగపడే వరికపూడిశిల ఎత్తిపోతల కు అనుమతించారు.

కృష్ణ డెల్టా ముఖ్యంగా దివిసీమ వారికి ఉపయోగపడేలా ప్రకాశం బ్యారేజి దిగువున 12,45 మరియు 65వ కి.మీ వద్ద కొత్త ప్రాజెక్టులకు అనుమతించారు.

ఉత్తరాంధ్ర సుజాల స్రవంతి కాలువ సామర్ధ్యాన్ని పెంచటానికి నిర్ణయించారు.

మా వెలిగొండ మొదటి టన్నెల్ లో మిగిలిన 1.56 కి.మీ(ఈ లెక్క ఎంత కచ్చితమో పనులు మొదలైతే కానీ తెలియదు,నాకు తెలిసి తొవ్వాలసింది ఇంతకాన్నా ఎక్కువ ఉంటుంది ) పనులను వేగవంతంగా చెయ్యమని ఆదేశించారు. 2014 బాబుగారి ప్రమాణ స్వీకారం నాటికి 13 కి.మీ టన్నెల్ పనులు పూర్తి కాగా గడిచిన 5 సంవత్సరాలలో కేవలం దాదాపు 3.5 కి.మీ టన్నెల్ మాత్రేమే తొవ్వారు. నది నుంచి నీటిని తీసుకోవాల్సిన హెడ్ రెగ్యులేటర్ పనులు మొదలు కూడా కాలేదు. ఇంక బాబుగారి నీటి చిత్తశుద్ధిని తప్పు పట్టకుండ ఏలా ఉంటాం?కడుపు మండకుండా ఎలావుంటుంది? గత 5 సంవత్సరాలు కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఏ ప్రాజెక్ట్ పని నికరంగా పూర్తికాలేదు.

ఈ నెలరోజుల్లో సముద్రం పాలయిన కృష్ణా నీళ్లు ఎన్నో తెలుసా?340 టీఎంసీ లు. గోదావరి నుంచే కాదు కృష్ణ నుంచి కూడా సందురంలోకి నీళ్లు పోతాయన్న సృహ లేకుండ పెండింగ్ ప్రాజెక్టులు ముఖ్యంగా వెలిగొండ (కనీసం 50 టీఎంసీ లు నిలువ చేసుకోవచ్చు,మరో 20 టీఎంసీలు 2014 నాటికే పూర్తి అయినా కాలువల ద్వారా ఇచ్చి ఉండొచ్చు) ను పూర్తిచెయ్యకుండా బాబుగారు నిర్లక్ష్యం చేశారు.

పట్టిసీమ పట్టిసీమ అని జపం చేశారు మరి ఈ సంవత్సరం పట్టిసీమ లేకుండానే కృష్ణా డెల్టాకు ,సీమకు ఎక్కడి నుంచి నీళ్లు వొచ్చాయో?

జగన్ గారు, ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు అభినందనలు. వీటితో పాటు హంద్రీ-నీవా కాలువ సామార్ధ్యాన్ని 3800 కు పెంచటానికి కాలువ వెడల్పు చేపించండి.

నిర్ణయాలు తీసుకోవటంతో సరిపోదు ,వీటిని అమలు పరిచి పనులు త్వరితగతిన పూర్తిచెయ్యటానికి ప్రాంతాల వారీగా కమీషన్ వెయ్యండి. సరిపడ నిధులు కేటాయించండి. మీరు ఇచ్చిన మాట నిలపెట్టుకుంటారని ప్రజలు ఆశిస్తారు,వైస్సార్ మొదలు పెట్టిన జలయజ్ఞం మీ హయాంలో ఈ 5సంవత్సరాలలో పూర్తవ్వాలి.

Gopireddy Srinivas Reddy anna,Kranthi Kumar Eragamreddy,Naresh Guvva,Vadde Srinivas,Alluri Devireddy,Sudhakar Kothapalli,Anji Venna ఇంకా అనేక మందికి అభినందనలు .

Thopudurthi Prakash Reddy Sir,Siddartha Reddy మీ శ్రమ ఫలిస్తుంది,కల సాకారం అవుతుంది.