iDreamPost
android-app
ios-app

Kesineni Nani TDP – కేశినేని నాని అలక వీడటానికి బాబు ఏమాయచేసాడో!

Kesineni Nani TDP – కేశినేని నాని అలక వీడటానికి బాబు ఏమాయచేసాడో!

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరబోతున్నారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. కేశినేని భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో తొలగించిన తర్వాత ఈ ప్రచారం పీక్స్ కు వెళ్ళింది..అయితే ఆ తరువాత అదేమీ లేదని ఎంపి కుమార్తె కేశినేని శ్వేత సోషల్ మీడియా వేదికగా తీసి పారేశారు. నిజానికి తాను గానీ, తన కూతురు గానీ వచ్చే ఎన్నికల్లో ఎంపీ పదవికి పోటీ చేయబోమని కేశినేని చంద్రబాబుకు చెప్పారట, అయితే తాను టీడీపీలోనే ఉంటానని కూడా చెప్పినట్టు తెలిసింది. ఒక ముగ్గురు నేతలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కేశినేని నాని ఆ నిర్ణయం తీసుకున్నట్లు భావించారు.

విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఆ నాయకులు కేశినేని నానిపై బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారి మీద చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయినా సరే, వారి మీద చంద్రబాబు చర్యలు తీసుకోక పోవడంతో ఆయన తాజాగా తన కార్యాలయం వెలుపల గోడకు ఉన్న చంద్రబాబు చిత్రపటాన్ని తొలగించినట్లు భావించగా అదేమీ లేదని కొట్టి పారేశారు. చాలా కాలం నుంచి చంద్రబాబుకు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న కేశినేని నాని అనూహ్యంగా చంద్రబాబు తలపెట్టిన 36 గంటల దీక్షలో కనిపించి, వైసీపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడి టిడిపి వర్గాలలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఆయన 36 గంటల దీక్ష లో తేలడం వెనుక అనేక సమీకరణాలు జరిగాయని తాజాగా వెల్లడైంది. అవేమిటంటే విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత కేశినేని నాని పలు డిమాండ్లు చంద్రబాబు ముందు పెట్టారని వాటిని చంద్రబాబు సరిగా పట్టించుకోకపోవటంతో కేశినేని నానికి అధినేత చంద్రబాబు వద్ద తలుపులు మూసుకుపోయాయని భావించారు.

ఇక విజయవాడ నగరంలో పార్టీకి మనం చెప్పిందే వేదం అని ఆ ముగ్గురు నేతలు భావిస్తూ రాగా, వారికీ బాబు షాక్ ఇచ్చారని తెలిసింది. విషయం ఏమిటంటే ముందు చంద్రబాబు పట్టించుకోనట్లు కనిపించినా సరే, బాబు కేశినేని నాని డిమాండ్లకు చంద్రబాబు ఒప్పుకున్నారని దానికి తోడు ఇప్పుడు ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించారని పార్టీ పెద్దలు చెప్పటంతో సొంత పార్టీలోని ఆ ముగ్గురు నేతలు షాక్ కి గురయ్యారని అంటున్నారు. ఇక బాబు హామీతో ఆ ముగ్గురి నాయకులతో కేశినేని ఎలా వ్యవహరించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు కేశినేని నాని ఆక్టివ్ అయ్యారనుకుంటే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైలెంట్ అయ్యారు.

Also Read :Chandrababu Kuppam Tour – బాబుగారి చిత్రగుప్తుడి అవతారం