డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడు లేని రీతిలో వరస సినిమాలతో తెగ బిజీగా ఉండటం చూస్తూనే ఉన్నాం. రాధే శ్యామ్ విడుదలకు ఇంకా టైం ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు జూలై వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా ట్రైలర్ తాలూకు అప్డేట్ కూడా రాలేదు కాబట్టి వచ్చే నెల నుంచి ప్రమోషన్ స్పీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రెబెల్ స్టార్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం అయిదు నుంచి ఆరు నెలల్లోపే మొత్తం పూర్తయ్యేలా ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఇది ఈ ఏడాది లేదా వచ్చే సంక్రాంతికి రావడం పక్కా. రాధే శ్యామ్ రిలీజయ్యాక సలార్ డేట్ ని ప్రకటిస్తారు.
ఇక మరోవైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆల్రెడీ అది పురుష్ పనులు వేగవంతం చేశాడు. ప్రభాస్ అవసరం లేని సీన్లు మొత్తం పూర్తి చేస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ తో పాటు మన హీరో కూడా ఒకేసారి షెడ్యూల్ లో ప్రవేశించే అవకాశం ఉంది. ఇంకా సీత పాత్రధారి ఎవరో సస్పెన్సు గానే ఉంది. అవతల నాగ అశ్విన్ సైతం తన డ్రీం ప్రాజెక్ట్ కు కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలైఉన్నాడు. దీనికి కనీసం రెండేళ్లు అవసరం పడేలా ఉండటంతో తనకు ఎక్కువ గ్యాప్ రాకుండా ప్రభాస్ కొన్ని సినిమాలు ముందే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా యష్ రాజ్ ఫిలిమ్స్ కూడా ఈ దిశగానే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని టాక్.
బ్యాండ్ బాజా బారాత్, శుద్ దేశీ రొమాన్స్ లాంటి సినిమాలకు దర్శకుడిగా చేసిన మనీష్ శర్మతో ఓ స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్నారట. కాకపోతే అది ఇంకా ప్రభాస్ దాకా రాలేదు. ఇంకో రెండేళ్లు ఖాళీ లేని నేపథ్యంలో ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో వేచి చూడాలి. కరణ్ జోహార్ తరహాలో ప్రభాస్ తో ఓ సినిమా చేసి బ్లాక్ బస్టర్ చేయాలని బాహుబలి నుంచే ప్లానింగ్ లో ఉన్న యష్ బ్యానర్ కు ఇతరత్రా కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇప్పుడు మాత్రం గట్టిగానే ట్రై చేస్తోందట. మొత్తానికి చూస్తూనే ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి నుంచి కిందకు దిగడం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.